AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాగుపాము, కొండచిలువ మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారో చూడండి..

Viral Video: ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో నాగుపాము ఒకటి. అది కాటు వేసిందంటే నీరు కూడా అడగరు. అంతేకాదు పాములలో రాజు నాగుపాము. కానీ

Viral Video: నాగుపాము, కొండచిలువ మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారో చూడండి..
Cobra And Python
uppula Raju
|

Updated on: Nov 07, 2021 | 5:54 PM

Share

Viral Video: ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో నాగుపాము ఒకటి. అది కాటు వేసిందంటే నీరు కూడా అడగరు. అంతేకాదు పాములలో రాజు నాగుపాము. కానీ సైజు పరంగా చెప్పాలంటే పాముల జాతులలో కొండచిలువ అతిపెద్దది అత్యంత శక్తివంతమైనది. దీని కబంధ హస్తాల్లో చిక్కుకున్నారంటే బయటపడటం అసాధ్యం. అయితే ఈ రెండు శక్తివంతమైన పాములు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎవరు గెలిచారో తెలుసుకుందాం.

1 నిమిషం 25 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వైరల్ ప్రెస్ తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ పోరాటం సింగపూర్‌లోని బులో వెట్‌ల్యాండ్ రిజర్వ్‌లో జరిగింది. ఈ వీడియోలో కొండచిలువ, నాగుపాము ఒకదానికొకటి ఘర్షణ పడడాన్ని చూడవచ్చు. మనందరికీ తెలిసినట్లుగా నాగుపాము రాజు. రాజును ఓడించడం అంత ఈజీ కాదని ఇక్కడ నిరూపించాడు. ఒక చిన్న పోరాటంలో నాగుపాము కొండచిలువను అధిగమించింది. ఆ తర్వాత అతన్ని చంపి మింగేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బులోహ్ వెట్‌ల్యాండ్ రిజర్వ్ ఉద్యోగులు నాగుపాము, కొండచిలువకు మధ్య భీకర పోరాటాన్ని గుర్తించారు. అయితే కొంతసమయం వరకు కొండచిలువ ఆధిపత్యం చెలాయించింది. తర్వాత నాగుపాము దానిని ఓడించి మింగడం మొదలెట్టింది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే దృశ్యం. ఎందుకంటే కొండచిలువ పేరు వినగానే ప్రజలు దాని శక్తిని ఊహించుకుంటారు. కానీ ఇక్కడ నాగుపాము కొండచిలువ కంటే కొంచెం పెద్దది. అది కొండచిలువను సులభంగా అధిగమించడం విశేషం. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను యాభై వేలకు పైగా వీక్షించారు.

Breakfast: ప్రొటీన్స్‌ అధికంగా ఉండే టిఫిన్స్‌ ఇవే..! బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఎంతో మంచిది..

Smart Phones: ఈ 5 స్మార్ట్‌ఫోన్‌లు రూ.15000 కంటే తక్కువే.. 6GB RAM, బలమైన బ్యాటరీ, పెద్ద డిస్‌ ప్లే..

Ashish Nehra: ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‎గా ఉండరాదని రూల్ బుక్‌లో ఎక్కడా రాయలేదు.. ఆశిశ్ నెహ్రా..