Smart Phones: ఈ 5 స్మార్ట్‌ఫోన్‌లు రూ.15000 కంటే తక్కువే.. 6GB RAM, బలమైన బ్యాటరీ, పెద్ద డిస్‌ ప్లే..

Smart Phones: భారతీయ మొబైల్ మార్కెట్లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇవి విభిన్న ఫీచర్లతో కూడి ఉన్నాయి. ఇందులో Samsung, Realme, Redmi, Oppo, Vivo వంటి

Smart Phones: ఈ 5 స్మార్ట్‌ఫోన్‌లు రూ.15000 కంటే తక్కువే.. 6GB RAM, బలమైన బ్యాటరీ, పెద్ద డిస్‌ ప్లే..
Best Phone
Follow us
uppula Raju

|

Updated on: Nov 07, 2021 | 5:08 PM

Smart Phones: భారతీయ మొబైల్ మార్కెట్లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇవి విభిన్న ఫీచర్లతో కూడి ఉన్నాయి. ఇందులో Samsung, Realme, Redmi, Oppo, Vivo వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. ఈ రోజు మనం 6 GB RAM, బలమైన బ్యాటరీతో సహా పెద్ద డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం. ఈ స్మార్ట్‌ఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో సహా ఆఫ్‌లైన్ మార్కెట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

1. Realme Narzo 50A, ధర రూ.12,499 Realme Narzo 50Aని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.12,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో 4 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఈ Realme ఫోన్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో MediaTek ప్రాసెసర్ ఉంది. అలాగే 256 GB SD కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో వెనక కెమెరా 50 మెగాపిక్సెల్‌. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.

2. POCO M3, ధర రూ. 11,499 POCO M3 ధర రూ.11,499. ఇందులో వినియోగదారులు 6 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని పొందుతారు. అలాగే వినియోగదారులు 512 GB SD కార్డ్‌ను ఇందులో ఉంచవచ్చు. ఈ ఫోన్ 6.53 అంగుళాల Full HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో ప్రాథమిక కెమెరా 48 మెగాపిక్సెల్‌లు. 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 662 ప్రాసెసర్‌తో వస్తుంది.

3. Realme 8i, ధర రూ.13,999 ఈ స్మార్ట్‌ఫోన్ రూ.13,999. ఇది 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. అలాగే వినియోగదారులు 256 GB SD కార్డ్‌ను ఇందులో అమర్చవచ్చు. కంపెనీ ఇందులో 5000 mAh బ్యాటరీని అందించింది. ఇది MediaTek Helio G96 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రాథమిక కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

4. Samsung Galaxy F22, ధర. రూ.14,999 ఈ Samsung ఫోన్ 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 14,999. వినియోగదారులు1TB SD కార్డ్‌ను ఇందులో ఉంచవచ్చు. అలాగే ఇది 6.4 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది MediaTek Helio G80 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో వెనుక ప్యానెల్‌లో క్వాడ్-కెమెరా సెటప్ ఇచ్చారు. దీనిలో ప్రాథమిక కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

5. Redmi Note 10S, ధర రూ.15,190 Redmi Note10Sని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.15,190కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ Redmi ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Helio G95 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే ఇది వెనుక ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో ప్రాథమిక కెమెరా64 మెగాపిక్సెల్‌లు, ముందు కెమెరా 13 మెగాపిక్సెల్‌లు ఇచ్చారు. ఈ ఫోన్ 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఆల్కహాల్‌ ఎలా విషంగా మారుతుంది.. కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారు.. తాగేవాడు ఎందుకు చనిపోతున్నాడు..

స్నేహితులకు, బంధువులకు వింత షరతు విధించిన వధువు..! ఏంటో తెలిస్తే షాక్‌ అవుతారు..

WhatsApp: ఫోన్‎లో నెట్ లేకున్నా వెబ్ వాట్సాప్ పని చేస్తుంది.. అది ఎలాగంటే..

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..