స్నేహితులకు, బంధువులకు వింత షరతు విధించిన వధువు..! ఏంటో తెలిస్తే షాక్‌ అవుతారు..

Bride Condition: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఈ వేడుకను అందరు ఎంతో సంతోషంగా, హుందాగా నిర్వహించుకోవాలనుకుంటారు.

స్నేహితులకు, బంధువులకు వింత షరతు విధించిన వధువు..! ఏంటో తెలిస్తే షాక్‌ అవుతారు..
Bride
Follow us
uppula Raju

|

Updated on: Nov 07, 2021 | 4:17 PM

Bride Condition: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఈ వేడుకను అందరు ఎంతో సంతోషంగా, హుందాగా నిర్వహించుకోవాలనుకుంటారు. స్నేహితులు, బంధువులను పిలిచి విందు, వినోదాలతో హుషారెత్తిస్తారు. ఆత్మీయులు, అతిథుల ఆశీస్సులు తీసుకొని కలకాలం ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. అంతేకాదు కొంతమంది వివాహానికి హాజరైన అతిథులకు, స్నేహితులకు కానుకలు కూడా పంపిణీ చేస్తారు. కానీ ఇక్కడ తన వివాహవేడుకలో ఓ వధువు పెట్టిన కండిషన్ చూస్తే అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వింత కండీషన్‌ ఏంటో చూద్దాం.

వివాహం అనేది ఒక గొప్ప వేడుక. దీనిని అందరు గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. అయితే ఇక్కడ ఒక వధువు తన వివాహానికి హాజరయ్యే బంధువులకు, స్నేహితులకు ఒక వింత కండీషన్ పెట్టింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఈ వేడకకు హాజరయ్యే వారందరు వారి ఖర్చులు వారే భరించాలి. మేకప్‌ ఖర్చులన్నీ ఎవరికి వారే భరించాలని ముందుగానే స్నేహితులకు చెప్పింది. పెద్ద రిసార్ట్ బుక్‌ చేసింది కానీ అందులో ఉండేందుకు ఎవరికి వారే డబ్బులు ఖర్చు చేయాలి. అక్కడి ఖర్చులన్నీ వారే భరించాలి. తాను ఒక్క రూపాయి కూడా పెట్టేది లేదని తెగేసి చెప్పింది. ఇది విని అందరు ఇదెక్కడి వధువండి బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ వింత కండీషన్ విన్న స్నేహితులు ఆమె వివాహానికి రావడానికి నిరాకరించారు. బంధువులు కూడా అంతే సంగతులు అన్నారు. అంతేకాదు ఈ వింత కండీషన్‌ పెట్టిన పెళ్లికూతురిని సోషల్ మీడియాలో అందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ కండీషన్ వల్ల వివాహ వేడుక కోసం బుక్ చేసిన రిసార్ట్‌లో వధువు, వరుడి కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ వింత పరిస్థితిని వధువు స్నేహితులురాలు ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం అందరికి తెలిసిపోయింది. దీంతో అందరు ఆ వధువుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

WhatsApp: ఫోన్‎లో నెట్ లేకున్నా వెబ్ వాట్సాప్ పని చేస్తుంది.. అది ఎలాగంటే..

BJP: కొనసాగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ..

Funny Video: ఆఫీస్ డుమ్మాకు..కొత్తగా ఫన్నీ ట్రిక్.. ఓరీ దేవుడా..! ఆఫీస్‌కి లీవ్‌ ఇలా కూడా అడుగుతారా..?(వీడియో వైరల్)

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే