WhatsApp: ఫోన్‎లో నెట్ లేకున్నా వెబ్ వాట్సాప్ పని చేస్తుంది.. అది ఎలాగంటే..

మనం వెబ్ వాట్సాప్‎ వాడుతుంటాం. అయితే మన డివైస్‎ను సిస్టమ్ లేదా లాప్‎టాప్‎కు కనెక్ట్ చేస్తాం. మన ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్చాఫ్ అయితే వెబ్ వాట్సాప్ డిస్‎కనెక్టు అవుతుంది...

WhatsApp: ఫోన్‎లో నెట్ లేకున్నా వెబ్ వాట్సాప్ పని చేస్తుంది.. అది ఎలాగంటే..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 07, 2021 | 4:13 PM

మనం వెబ్ వాట్సాప్‎ వాడుతుంటాం. అయితే మన డివైస్‎ను సిస్టమ్ లేదా లాప్‎టాప్‎కు కనెక్ట్ చేస్తాం. మన ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్చాఫ్ అయితే వెబ్ వాట్సాప్ డిస్‎కనెక్టు అవుతుంది. ఈ సమస్యకు పరిష్కరంగానే వాట్సాప్ మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు వ్యాట్సాప్ ప్రకటించింది. దీంతో ఫోన్లను నెట్‎కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే వెబ్ వాట్సాప్ ఉపయోగించవచ్చు. ఏకకాలంలో నాలుగు పరికరాల్లో వాట్సాప్ కనెక్ట్ చేయవచ్చు. కొద్దిరోజుల క్రితం ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌ను యూజర్స్‌కి పరిచయం చేసింది వాట్సాప్.

ఇలా కనెక్ట్ చేయాలి..

వాట్సాప్‎కి వెళ్లి సెట్టింగ్‎పై క్లిక్ చేయాలి. వెబ్‌ వాట్సాప్‌కి కనెక్ట్ అయ్యేందుకు లింక్‌ డివైజ్‌పై క్లిక్ చేయాలి. అందులో మీకు ‘యూజ్‌ వాట్సాప్‌ ఇన్‌ అదర్‌ డివైజెస్‌’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ వాట్సాప్‌ని ఒకేసారి నాలుగు డివైజ్‌లలో ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌ మల్టీడివైజ్‌ ఫీచర్‌తో యూజర్స్‌ ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ను వాడుకోవచ్చు. వాట్సాప్‌ ఖాతా ఉన్న ఫోన్‌లో ఇంటర్నెట్‌ కనెక్షన్ లేనప్పటికీ మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ పని చేస్తుంది. వరుసగా 14 రోజులపాటు ప్రైమరీ డివైజ్‌ (వాట్సాప్‌ ఖాతా ఉన్న ఫోన్‌) మిగిలిన నాలుగు డివైజ్‌లతో కనెక్ట్ కాకపోతే వాటిలోంచి వాట్సాప్‌ ఆటోమేటిగ్గా లాగవుట్‌ అవుతుంది. ఇక్కడ వాట్సాప్‌ ఉన్న కంప్యూటర్‌, లాప్‎టాప్, పీసీ లేదా మొబైల్‌కి తప్పనిసరిగా ఇంటర్నెట్‌ ఉండాలి.

మల్టీ డివైజ్‌ ఫీచర్‌ ద్వారా లాగిన్‌ అయిన యాప్‌ లేదా డెస్క్‌టాప్‌ డివైజ్‌ల నుంచి ఒకేసారి కాల్స్‌ చెయలేరు. అలానే ఈ ఫీచర్‌ ద్వారా కనెక్ట్ అయిన డివైజ్‌లకు కాల్స్ రావు. లైవ్‌ లొకేషన్స్‌, కంపానియన్ డివైజ్‌లను చూడడటం, చాట్‌లను పిన్‌ చేయడం, గ్రూప్‌లలో జాయిన్ కావడం, గ్రూప్‌లను చూడటం, గ్రూప్‌లలోకి ఇన్వైట్ చేయడం వంటివి చేయలేరు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పూర్తి స్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చామని వాట్సాప్‌ తెలిపింది. ఐఓఎస్‌ యూజర్స్‌ మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్స్‌ ఈ ఫీచర్‌ రాకుంటే తమ మొబైల్స్‌లో వాట్సాప్‌ యాప్‌ని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also.. Elon Musk: 10 శాతం వాటా విక్రయించాలా వద్దా.. ట్విట్టర్ పాలోవర్స్‎కి ఎలాన్ మస్కు ప్రశ్న..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే