Funny Video: ఆఫీస్ డుమ్మాకు..కొత్తగా ఫన్నీ ట్రిక్.. ఓరీ దేవుడా..! ఆఫీస్‌కి లీవ్ ఇలా కూడా అడుగుతారా..?(వీడియో వైరల్)
సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరోజు సెలవు కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది..లీవ్ అనేది అంత ఈజీగా దొరకదు..చెప్పిన కారణం నిజమైనదే అయినా ఒక్కోసారి బాస్‌లకి అది అర్థం కాదు..అందుకోసమే చాలా మంది ఆఫీస్ లీవ్ కోసం జ్వరం వచ్చించింది..
సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరోజు సెలవు కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది..లీవ్ అనేది అంత ఈజీగా దొరకదు..చెప్పిన కారణం నిజమైనదే అయినా ఒక్కోసారి బాస్‌లకి అది అర్థం కాదు..అందుకోసమే చాలా మంది ఆఫీస్ లీవ్ కోసం జ్వరం వచ్చించింది..కడుపు నొప్పి, లేకపోతే తాతో, బామ్మో చనిపోయిందనో చెబుతూ ఎస్కేప్ అవుతుంటారు. చెప్పేవి అబద్ధాలు అని బాస్ కి తెలిసినా కూడా సెలవు ఇచ్చేంతలా నటించేస్తుంటారు..కానీ, కొంతమంది చెప్పే సాకులు వింటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి బాస్ లకు ఏర్పడుతుంది. తాజాగా ఒక బాస్ పరిస్థితి అలాగే ఉంది. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ ఒక మెసేజ్ పెట్టాడు..అది చూశాక బాస్ ఒక్కరే కాదు… తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు..ఇంతకీ ఏంటా రీజన్ అనేకదా మీ డౌంట్…అక్కడికే వస్తున్నాం..
తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ ఒక మెసేజ్ పెట్టాడు. ఆ సెలవుపై కారణం కూడా చెప్పాడు. అది ఏంటంటే.. “డియర్ బాస్.. ఈరోజు నేను ఆఫీస్ కి రాలేకపోతున్నాను.. ఎందుకంటే నా సాక్సులు చాలా మురికిగా ఉన్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ నా సాక్సులను ఉతకలేదు. సాక్సులు లేకుండా షూస్ వేసుకోలేను .. షూస్ లేకుండా ఆఫీస్ కి రాలేను.. అందులోనూ నా షూస్ కి బాగా రంద్రాలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఆఫీస్ కి రావడం లేదు” అని మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ చదివిన బాస్ కి దిమ్మతిరిగిపోయింది. ఏం చెప్పాలో తెలియక మరో మెసేజ్ పెట్టాడు.
‘ఏంటి కామెడీగా ఉందా?’ అని రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా ‘మీరు అంతగా నవ్వుతున్నారు.. ఏంటి కామెడీ చేస్తున్నారా..? షూస్ లేకపోవడం ఏంటి..? సరే ఆఫీస్ కు రా రేపు మాట్లాడుకుందాం.. ఈ ప్లేస్ లో వేరే వ్యక్తి ఉంటే రేపటి నుంచి ఆఫీసుకు రావొద్దు అనేవాడిని’ అని రిప్లై ఇచ్చారు. అంతటితో ఆగలేదు.. ఈ మెసేజ్ లను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదీ ఉద్యోగుల తీరు అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. అయితే ఈ మెసేజ్ అందరికీ కనక్ట్ అయ్యేలా ఉంది కాబట్టి వైరల్ గా మారింది.
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

