Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan, Shardhol Dance: డ్యాన్స్ ఇరగదీసిన ఇషాన్, శార్దుల్.. ఫ్యాన్స్‌ ఫిదా.! పిల్లలకు గిఫ్ట్‌లు పంచిన రిషబ్‌పంత్‌.. (వీడియో)

Ishan, Shardhol Dance: డ్యాన్స్ ఇరగదీసిన ఇషాన్, శార్దుల్.. ఫ్యాన్స్‌ ఫిదా.! పిల్లలకు గిఫ్ట్‌లు పంచిన రిషబ్‌పంత్‌.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 07, 2021 | 3:40 PM

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా సరదాగా గడిపింది. ఇషాన్-ఠాకూర్ డ్యాన్స్ చేస్తూ, రిషబ్ పంత్ బహుమతులు పంచుతూ కనిపించారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.


న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా సరదాగా గడిపింది. ఇషాన్-ఠాకూర్ డ్యాన్స్ చేస్తూ, రిషబ్ పంత్ బహుమతులు పంచుతూ కనిపించారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్టోబరు 31న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ -న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు, టీమిండియా ఆటగాళ్లు కొత్త అవతారంలో కనిపించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021లో భారత క్రికెట్ జట్టు ఈరోజు రెండో మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఇందులో గెలిస్తేనే భారత్‌ సెమీ ఫైనల్‌కు వెళ్తుంది. అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టు సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో టీమ్ ఇండియా సరదాగా గడుపుతున్న కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

టీమ్ ఇండియా హాలోవీన్ వేడుకలలో మునిగిపోయింది. ఈ వేడుకలో కిషన్, ఠాకూర్ తమ జుగల్‌బందీని చూపించి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకుని జంటగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే మిగతా ఆటగాళ్లు, వీరిద్దరి డ్యాన్స్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇందులో కనిపించారు. .భారత యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్‌పంత్‌ పిల్లలకు బహుమతులు పంపిణీ చేస్తూ కనిపించాడు. పంత్ ఒక బ్యాగ్ నిండా చాక్లెట్లు, టోఫీలు తెచ్చి జట్టు సభ్యుల పిల్లలకు పంచాడు. ఈ సమయంలో, రవిచంద్రన్ అశ్విన్ కుమార్తెలు రోహిత్ శర్మ కుమార్తె పంత్ నుంచి టోఫీలను తీసుకోవడం కనిపించింది. నెట్టింట వైరల్‌ అవుతున్న వీ వీడియోలు మీరూ చూసేయండి…

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…