Viral Video: రెండు నక్కలను చెడుగుడు ఆడుకున్న పిల్లి.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్ చెప్పక మానరు..!
Viral Video: సోషల్ మీడియాలో ఎఫెక్ట్.. ప్రంపచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో ప్రజలకు సమాచారం చేరుతుంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు, సరిసృపాలకు..
Viral Video: సోషల్ మీడియాలో ఎఫెక్ట్.. ప్రంపచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో ప్రజలకు సమాచారం చేరుతుంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు, సరిసృపాలకు సంబంధించి వీడియోలు అనేకం సర్క్యూలేట్ అవుతుంటాయి. ఫేస్‌బుక్ రీల్స్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌లలో వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కచ్చితంగా నవ్వును ఆపుకోలేరంతే.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వీడియోలో ఒక పిల్లి నక్కలతో కలబడటం స్పష్టంగా చూడొచ్చు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించబోయిన రెండు నక్కలకు ఆ పిల్లి చుక్కలు చూపించింది. మరోసారి పిల్లి జోలికి వెళ్లాలంటేనే వందసార్లు ఆలోచించేలా నక్కలకు ఝలక్ ఇచ్చింది ఆ పిల్లి. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రెండు నక్కలను పిల్లి అడ్డుకుని తరిమిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటజన్లు పిల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఏం ధైర్యం రా బాబూ కితాబిస్తున్నారు. ‘పిల్లి భయపెట్టిన తీరు మామూలుగా లేదు’, ‘ఈ నక్కలు దేనినైనా వేటాడాలంటే వందసార్లు ఆలోచించేలా చేసింది.’ ‘వామ్మో.. పిల్లి మాంచి ఫైర్ మీద ఉంది.’ అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ ఐడీ నేచర్ 27_12 అనే అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వేలాది వ్యూస్ రాగా, వందలాది లైక్స్ వచ్చాయి.
Viral Video:
View this post on Instagram
Also read:
Chanakya Niti : మీరు పిల్లలను ఉన్నతులు కావాలా?.. అయితే ఈ 3 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..