Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti : మీ పిల్లలు ఉన్నతులు కావాలా?.. అయితే ఈ 3 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

చాణక్య నీతి: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తులో తమ ఇంటి పేరును నిలబెట్టాలని, కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆశిస్తారు.

Chanakya Niti : మీ పిల్లలు ఉన్నతులు కావాలా?.. అయితే ఈ 3 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Chanakya Niti
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 08, 2021 | 7:06 AM

చాణక్య నీతి: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తులో తమ ఇంటి పేరును నిలబెట్టాలని, కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆశిస్తారు. అయితే, పిల్లల మొదటి విద్యభ్యాసం వారి తల్లిదండ్రుల నుండే మొదలవుతుంది. అందుకని పిల్లలు భవిష్యత్‌లో మంచి స్థానంలో ఉండటానికి తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. తల్లిదండ్రుల నుంచే పిల్లలు అలవాట్లను, ఆచార వ్యవహారాలను అనుసరించడం నేర్చుకుంటాడు. తల్లిదండ్రుల పెంపకమే.. వారికి పునాదిని సిద్ధం చేస్తాయి.

ఆచార్య చాణక్య చెప్పిన దాని ప్రకారం.. మంచి విలువలతో పెంపకానికి పునాది వేస్తే, భవిష్యత్తులో మీ పిల్లలు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఇందుకోసం తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో పాటించడంతోపాటు పిల్లల సంరక్షణలో అత్యంత శ్రద్ధ వహించాలి. ఆచార్య చాణక్యుడు కూడా అలాంటిదే నమ్మాడు. పిల్లల భవిష్యత్తును నిర్మించడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దదనే విషయాన్ని గ్రహించాలి. పిల్లల పెంపకం గురించి ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అనేక విషయాలను చాణక్య చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి వాతావరణం.. పిల్లవాడు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించడం ద్వారా చాలా నేర్చుకుంటాడు. మీరు అతనికి ఏం నేర్పిస్తే.. అతను అదే చేస్తాడు. మీ ఇంట్లో గొడవలు, ఉద్రిక్త వాతావరణం ఉంటే ఖచ్చితంగా మీ బిడ్డ కూడా చిరాకు, కోపంతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ బిడ్డను ప్రశాంతంగా, సున్నిత వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకుంటే.. మీ ఇంటి వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా ఉండేలా చూడండి.

తల్లిదండ్రుల ప్రవర్తన.. పిల్లవాడు తన తల్లిదండ్రులను అనుసరిస్తాడు. అతని ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో, అతను కూడా అదే అనుసరిస్తాడు. ప్రతి తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకోవాలి. ఒకరికొకరు పూర్తి గౌరవం ఇచ్చుకోవాలి. మీ మాటలు మధురంగా, వినయంగా ఉండేలా చూసుకోండి. మిమ్మల్ని చూసి మీ బిడ్డ కూడా అదే నేర్చుకుంటారు.

బిడ్డను ప్రోత్సహించాలి.. ప్రతి బిడ్డకు విభిన్నమైన ప్రతిభ, సామర్థ్యాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో అతనిని ఇతర పిల్లలతో పోల్చవద్దు. పిల్లల ప్రతిభను అర్థం చేసుకోవడానికి, వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. మీ బిడ్డ ఏదైనా రంగంలో ప్రావీణ్యం కలిగి ఉంటే.. సానుకూలంగా వారిని ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం వలన వారు ఇతర పనులను కూడా సులభంగా చేయడం ప్రారంభిస్తారు. మీ బిడ్డను ప్రేరేపించడానికి వారికి గొప్ప వ్యక్తుల కథలు చెప్పాలి. అలాగే, మీ పిల్లల నిఘంటువు నుండి అసాధ్యం అనే పదాన్ని తొలగించే ప్రయత్నం చేయండి.

Also read:

Petrol-Diesel Price: అది తగ్గిస్తే రూ.77 కే పెట్రోల్, డీజిల్.. సంచలన విషయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్..

T20 World Cup 2021, IND vs NAM: కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20.. హ్యాట్రిక్ విజయంతో ముగించేందుకు ఆరాటం..!

Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్.. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే..