IRCTC Tours: ఐఆర్సీటీసీ శ్రీరామాయణ యాత్ర ప్రారంభం ఈరోజే.. పూర్తి వివరాలు ఇవే!

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి శ్రీ రామాయణ యాత్ర పర్యటనల శ్రేణిని ప్లాన్ చేసింది.

IRCTC Tours: ఐఆర్సీటీసీ శ్రీరామాయణ యాత్ర ప్రారంభం ఈరోజే.. పూర్తి వివరాలు ఇవే!
Irctc Ramayan Yatra 2021
Follow us

|

Updated on: Nov 07, 2021 | 12:08 PM

IRCTC Tours:  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి శ్రీ రామాయణ యాత్ర పర్యటనల శ్రేణిని ప్లాన్ చేసింది. మెరుగైన కరోనా (COVID-19) పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైళ్ల ద్వారా దేశీయ పర్యాటకాన్ని తిరిగి ప్రారంభించింది ఐఆర్సీటీసీ(IRCTC). ఇందులో భాగంగా ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. నవంబర్ 7న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే మొదటి పర్యటన శ్రీరాముని జీవితానికి సంబంధించిన అన్ని ప్రధాన ప్రదేశాలకు ప్రయాణం చేస్తుంది.

తదుపరి యాత్రలు ఎప్పుడంటే..

ఇతర ప్యాకేజీలలో 12 రాత్రులు/13 రోజులు శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్-మధురై నుంచి ఉంటుంది. ఇది నవంబర్ 16న ప్రారంభం కానుంది. శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్-శ్రీగంగానగర్‌కు 16 రాత్రి / 17 రోజుల ప్యాకేజీ కూడా ఉంది. ఈ రైలు నవంబర్ 25న బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ ప్రకటించింది.

శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్..స్టాపేజ్‌లు

ఈ రైలు మొదటి స్టాప్ అయోధ్యలో పర్యాటకులు శ్రీ రామ జన్మభూమి ఆలయం,నందిగ్రామ్‌లోని భారత్ మందిర్‌తో పాటు హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. తదుపరి గమ్యస్థానం బీహార్‌లోని సీతామర్హి లోని సీత జన్మస్థలం. అక్కడి నుంచి జనక్‌పూర్‌లోని రామ్-జాంకీ ఆలయాన్ని రోడ్డు మార్గంలో సందర్శిస్తారు.

దీని తరువాత రైలు వారణాసికి బయలుదేరుతుం. పర్యాటకులు వారణాసి, ప్రయాగ, శృంగవర్పూర్, చిత్రకూట్ ఆలయాలను రోడ్డు మార్గంలో సందర్శిస్తారు. వారణాసి, ప్రయాగ, చిత్రకూట్‌లలో రాత్రి బస ఏర్పాటు చేస్తారు.

నాసిక్‌లో రైలు ఆగిపోతుంది. త్రయంబకేశ్వరాలయం మరియు పంచవటి దర్శనం ఉంటుంది. నాసిక్ తరువాత, తదుపరి గమ్యం హంపి, ఇది కిష్కింధ పురాతన నగరం.

ఈ రైలు ప్రయాణానికి రామేశ్వరం చివరి స్టాప్ అవుతుంది. ఆ తర్వాత రైలు తన ప్రయాణంలో 17వ రోజు ఢిల్లీకి తిరిగి వస్తుంది. ఈ మొత్తం పర్యటనలో, అతిథులు దాదాపు 7500 కి.మీ. ప్రయాణం చేస్తారు.

శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక పర్యటన రైలు ఛార్జీలు

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన “దేఖో అప్నా దేశ్” కార్యక్రమానికి అనుగుణంగా IRCTC ఈ ప్రత్యేక పర్యాటక రైలును 2ACకి రూ. 82,950 మరియు 1AC తరగతికి రూ. 1,02,095 ధరతో ప్రారంభించింది.

ప్యాకేజీలో ఏమి ఉంటాయి?

ప్యాకేజీ ధరలో AC తరగతిలో రైలు ప్రయాణం, AC హోటళ్లలో వసతి, శాఖాహార భోజనం, AC వాహనాలలో రోడ్డు ప్రయాణాలు అలాగే సందర్శనా అవకాశాలు, ప్రయాణ బీమాతో పాటు ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ల సేవలు మొదలైనవి ఉంటాయి. సురక్షితమైన, మంచి ప్రయాణాన్ని అందించడం ద్వారా ప్రయాణంలో అవసరమైన అన్ని ఆరోగ్య జాగ్రత్తలు ఈ టూర్ లలో తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి: Google: గూగుల్ వినియోగదారులకు ఈ రూల్ తప్పనిసరి.. లేకుంటే లాగిన్ కావడం కష్టం!

Air Pollution: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాయుకాలుష్యంతో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ!

JioPhone Next: జియో ఫోన్ నెక్స్ట్ బ్యాటరీ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?