Google: గూగుల్ వినియోగదారులకు ఈ రూల్ తప్పనిసరి.. లేకుంటే లాగిన్ కావడం కష్టం!

గూగుల్  ఖాతాను కలిగివున్న వినియోగదారులందరికీ రెండు-దశల ధృవీకరణ (2SV) ఇప్పుడు తప్పనిసరి అయింది. వాస్తవానికి, కంపెనీ నవంబర్ 9 నుండి వినియోగదారులందరికీ 2SVని అమలు చేస్తోంది.

Google: గూగుల్ వినియోగదారులకు ఈ రూల్ తప్పనిసరి.. లేకుంటే లాగిన్ కావడం కష్టం!
Google 2 Step Verification
Follow us
KVD Varma

|

Updated on: Nov 07, 2021 | 8:08 AM

Google: గూగుల్  ఖాతాను కలిగివున్న వినియోగదారులందరికీ రెండు-దశల ధృవీకరణ (2SV) ఇప్పుడు తప్పనిసరి అయింది. వాస్తవానికి, కంపెనీ నవంబర్ 9 నుండి వినియోగదారులందరికీ 2SVని అమలు చేస్తోంది. వినియోగదారుల భద్రత కోసం కంపెనీ ఈ మార్పు చేస్తోంది. ఈ ధృవీకరణ తర్వాత, మీ ఖాతాకు లాగిన్ కోసం కొత్త లేయర్ యాడ్ అవుతుంది. ఈ 2SV ప్రక్రియ గురించి తెలుసుకుందాం..

2SVని ఆన్ చేసే ప్రక్రియ

  • గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి వెళ్లడం ద్వారా గూగుల్ రెండు దశల ధృవీకరణను సెర్చ్ చేయండి
  • ఇక్కడ మొదటి ఫలితం కన్‌ఫం అవుతుంది. దానిపై క్లిక్ చేయండి
  • మీరు నేరుగా ఈ లింక్ ద్వారా కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ కి  వెళ్లవచ్చు
  • ఇప్పుడు ఎగువన ఉన్న గెట్ స్టార్ట్ పై క్లిక్ చేయండి
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దిగువన ఉన్న గెట్ స్టార్ట్ పై క్లిక్ చేయండి
  • మీ ఇమెయిల్ ID.. పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి
  • ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ వివరాలు వస్తాయి. ఇక్కడ దిగువన ఉన్న CONTINUEపై క్లిక్ చేయండి
  • మీ ఫోన్ నంబర్ వస్తుంది. దిగువ నుండి టెక్స్ట్ లేదా కాల్ ఎంచుకోండి. తరువాత SEND పై క్లిక్ చేయండి
  • ఇప్పుడు మీ నంబర్‌పై OTP వస్తుంది. దానిని నమోదు చేసి తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్(2SV) ఆన్ చేయాలి.
  • Google ఈ సంవత్సరం 2SVని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. 2021 చివరి నాటికి 2SVలో 150

మిలియన్ల (150 మిలియన్లు) Google వినియోగదారులను ఆటో-ఎన్‌రోల్ చేయాలని తాము ప్లాన్ చేస్తున్నామని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ సంవత్సరం ప్రారంభంలో పేర్కొంది.

ఇప్పుడు నవంబర్ 9న, 2SV ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. నివేదికల ప్రకారం, రెండు-దశల ధృవీకరణను ప్రారంభించడానికి Google వినియోగదారులందరికీ ఇమెయిల్..యాప్‌లో ధృవీకరణను పంపుతోంది. వెరిఫికేషన్ ప్రాసెస్ ఎనేబుల్ కాకపోతే నవంబర్ 9న ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుందని మెసేజ్‌లో చెబుతున్నారు.

లాగిన్ కోసం ఫోన్‌కు రెండు-దశల ధృవీకరణ అవసరం అంటే మీరు మీ లాగిన్‌ను యాక్సెస్ చేయడానికి అదనపు దశను అనుసరించాలి. అంటే, మీ ఖాతా భద్రత మునుపటితో పోలిస్తే పెరుగుతుంది. ఈ ప్రక్రియలో, మీరు మీ Google ఖాతాకు లాగిన్ చేసినప్పుడు, టపా పాస్‌వర్డ్‌తో పాటు OTP కూడా అవసరం. ఇది లేకుండా ఖాతా లాగిన్ అవ్వదు. అంటే, మీ ఖాతాను ఎవరూ సులభంగా హ్యాక్ చేయలేరు.

ఇవి కూడా చదవండి: GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!

Oppo: ఒప్పో నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. త్వరలో భారత మార్కెట్లో విడుదల..!