AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!

GST: జీఎస్టీ.. ఈ పదం దాదాపు అందరికి తెలిసిందే. కేంద్ర సర్కార్‌ 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత జీఎస్టీ అనే పదం గురించి ఎక్కువ చర్చించడం..

GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 04, 2021 | 9:11 AM

Share

GST: జీఎస్టీ.. ఈ పదం దాదాపు అందరికి తెలిసిందే. కేంద్ర సర్కార్‌ 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత జీఎస్టీ అనే పదం గురించి ఎక్కువ చర్చించడం జరుగుతోంది. జీఎస్టీ (GST) అంటే వస్తువుల మరియు సేవా పన్ను. అయితే కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసిన తర్వాత జూలై 2017 నుంచి ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసింది. ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక సేవను పొందినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ వన్‌ నేషన్‌ వన్‌ ట్యాక్స్‌ వ్యవస్థ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువు లేదా సేవలపై ఈ పన్ను రేటు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా కస్టమర్‌ ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

జీఎస్టీ మూడు రకాలు: జీఎస్టీని మూడు రకాలుగా విభజించారు. సెంట్రల్‌ జీఎస్టీ (CGST), రాష్ట్ర జీఎస్టీ (SGST), ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ (IGST). అయితే ఈ మూడు రకాల జీఎస్టీల అర్థాలు ఏమిటో తెలుసుకుందాం.

సెంట్రల్‌ జీఎస్టీ (CGST) అంటే ఏమిటి? CGST (సెంట్రల్‌ జీఎస్టీ) అంటే కేంద్ర వస్తువులు మరియు సేవా పన్ను. అంటే రాష్ట్రంలో ఏదైనా వస్తువుల సరఫరా లేదా సేవలు పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నును సీజీఎస్టీ (CGST) అంటారు. ఒక వ్యాపారవేత్త తన రాష్ట్రంలో మరొక వ్యాపారి నుంచి వస్తువులను తీసుకోవడం లేదా ఇతర సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది.

స్టేట్‌ జీఎస్టీ (SGST) అంటే ఏమిటి? స్టేట్‌ జీఎస్టీ (SGST) అంటే రాష్ట్ర వస్తువులు మరియు సేవా పన్ను అని అర్థం. రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే పన్నును రాష్ట్ర జీఎస్టీ అంటారు. ఒక వ్యాపారి తన సొంత రాష్ట్రంలోని మరొక వ్యాపారి నుంచి ఏదైనా వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఈ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వానికి సీజీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఐజీఎస్టీ (IGST) అంటే ఏమిటి? ఐజీఎస్టీ (IGST) అంటే ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ (Integrated Goods and Services Tax-IGST). సమగ్ర వస్తుసేవల పన్ను అని అర్థం. అంటే అంతరాష్ట్ర (రాష్ట్రాల మధ్య) వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరాపై ఐజీఎస్టీ చట్టం కింద విధించే పన్ను. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ వాటాను కలిగి ఉంటుంది. రాష్ట్రాల వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడుతుంది. ఐజీఎస్టీ సేకరించే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది. కేంద్ర, రాష్ట్రం రెండూ మరొక దేశం నుంచి ఉత్పత్తులు లేదా సేవలపై పన్ను పొందుతాయి.

ఐటీఆర్‌ రిటర్న్‌.. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. జీఎస్టీ వ్యవస్థలో వ్యాపారుల వ్యాపారంపై పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి నెలా మొత్తం అమ్మకాలు, కొనుగోళ్లు, పన్నులు తదతర వివరాలు ప్రభుత్వానికి చేరుతాయి. ఈ వివరాలన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఇది జీఎస్టీ రిటర్న్‌ వ్యవస్థ. వ్యాపారం సరిగ్గా లేకపోవడంపై డిపాజిట్‌ చేసిన పన్నులు క్రెడిట్‌ల రూపంలో వ్యాపారులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది.

Bank Loan: కస్టమర్లకు ఈ 9 బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ వడ్డీకే రుణాలు.. పూర్తి వివరాలు..!