Bank Loan: కస్టమర్లకు ఈ 9 బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ వడ్డీకే రుణాలు.. పూర్తి వివరాలు..!

Bank Loan: సాధారణంగా పండగ సీజన్‌లో బ్యాంకులు, వివిధ వాహన కంపెనీలు, ఇ-కామర్స్‌ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కస్టమర్లను మరింతగా..

Bank Loan: కస్టమర్లకు ఈ 9 బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ వడ్డీకే రుణాలు.. పూర్తి వివరాలు..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 03, 2021 | 6:37 AM

Bank Loan: సాధారణంగా పండగ సీజన్‌లో బ్యాంకులు, వివిధ వాహన కంపెనీలు, ఇ-కామర్స్‌ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా పండగల సీజన్‌లో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగా పలు బ్యాంకులు వినియోగదారులకు రుణాలపై ఆఫర్లు ప్రకటించాయి. ఆటో లోన్‌ వడ్డీ రేట్లు, కారు కొనుగోలుపై వడ్డీ రేట్లు వక్కువగా వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు వాహనం ఆన్‌ రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణం అందిస్తున్నాయి. ఇక మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తే 9 బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి.

► పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌: పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ప్రస్తుతం 6.8 శాతం వండ్డీ రేటుతో చౌకైన ఆటో రుణాన్ని అందిస్తోంది. నవంబర్‌ 10, 2021 వరకు లోన్‌ విషయంలో ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయడం లేదు. లక్ష రూపాయలు రుణం ఐదేళ్ల కాలానికి రూ.1,971 ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది ఈ బ్యాంకు.

► బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఈ బ్యాంకు ప్రస్తుతం డిసెంబర్‌ 31 వరకు జీరో ప్రాసెసింగ్‌ రుసుముతో 6.85 శాతం వడ్డీ రేటుతో కారు లోన్‌ అందిస్తోంది. అలాగే లక్ష రూపాయల రుణానికి రూ.1,973 ఈఎంఐతో ప్రారంభం అవుతుంది.

► ఇండియన్‌ బ్యాంక్‌: ఈ బ్యాంకు కారు రుణానికి 6.90 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. లక్ష రూపాయల రుణ ఐదేళ్ల కాలానికి రూ.1,975 ఈఎంఐని అందిస్తోంది.

► బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ఈ బ్యాంకు 7 శాతం వడ్డీతో కారు రుణం అందజేస్తోంది. ఏ వినియోగదారుడు అయినా ఐదేళ్ల పాటు లక్ష రూపాయల కారు లోన్‌ తీసుకుంటే రూ.1,980 ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు.

► బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర: ఈ బ్యాంకు 7.05 శాతం వడ్డీ రేటుతో ఆటో లోన్‌ అందిస్తోంది. అలాగే ఐదేళ్లపాటు లక్ష రూపాయలకు రూ.1,982 ఈఎంఐని అందిస్తోంది.

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌లు కూడా 7.25 వడ్డీ రేటును అందిస్తోంది. లక్ష రూపాయాల రుణానికి నెలవారీ ఈఎంఐ రూ.1,992 ఉంటుంది.

► పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు: ఈ బ్యాంకు7.30 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. లక్ష రూపాయల రుణం తీసుకుంటే రూ.1,994తో ఈఎంఐ చెల్లించవచ్చు.

ఇలా వినియోగదారులను ఆకర్షించేందుకు వాహనాలపై చౌకైనా వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి బ్యాంకులు. ప్రస్తుతం కార్లు కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటిపై దృష్టి సారిస్తున్నాయి బ్యాంకులు. తక్కువ వడ్డీ వసూలు చేయడం, రుణం పొందడంలో ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా త్వరగా రుణం అందించడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!