Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!

Dhanteras 2021: నవంబర్‌ 2, ధంతేరాజ్‌ దేశమంతటా జరుపుకొంటోంది. ప్రతీ ఏటా దీపావళికి రెండు రోజుల ముందు ధంతేరాస్‌ లేదా ధన త్రయోదశి జరుపుకోవడం..

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Nov 02, 2021 | 9:49 AM

Dhanteras 2021: నవంబర్‌ 2, ధంతేరాజ్‌ దేశమంతటా జరుపుకొంటోంది. ప్రతీ ఏటా దీపావళికి రెండు రోజుల ముందు ధంతేరాస్‌ లేదా ధన త్రయోదశి జరుపుకోవడం భారతీయులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లుగా భావిస్తుంటారు. ఈ రోజు దేశంలోని నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ఏ నగల షాపు వద్ద చూసినా రద్దీగా కనిపిస్తుంటుంది. అయితే ధంతేరాస్‌ రోజు పసిడి కొనుగోలు చేసేవారు ముందుగా ఈ టిప్స్‌ను గుర్తించుకోండి.

బంగారం స్వచ్ఛతను క్యారెట్‌లతో లెక్కిస్తారు. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. స్వచ్ఛమైన బంగారంతో గోల్డ్‌ కాయిన్స్‌, గోల్డ్‌ బార్స్‌, గోల్డ్‌ బిస్కెట్స్‌ మాత్రమే లభిస్తాయి. అభరణాల తయారీ కోసం ఉపయోగించే బంగారం 22 క్యారెట్‌ కూడా ఉంటుంది. ఎవరైనా అభరణాలు చూపించి ఇవి 24 క్యారెట్‌అని చెబితే నమ్మి మోసపోవద్దు. 24 క్యారెట్‌ బంగారం అభరణాలు తయారు చేయాలంటే అందులో ఇతర మెటల్స్‌ని కలుపాల్సి ఉంటుంది. అందుకే అభరణాలు 22 క్యారెట్‌తో ఉంటాయి. ఇక 22 క్యారెట్‌ జ్యువెలరీ మాత్రమే కాదు.. 18 క్యారెట్‌ నగలు కూడా ఉంటాయి. ఇందులో బంగారం స్వచ్ఛత తక్కువగా ఉంటుందని గమనించాలి.

18 క్యారెట్‌ నగలనే 22 క్యారెట్‌ అని నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే నగలను ఎంపిక చేసుకునేటప్పుడు అది 22 క్యారెట్‌ నగలా.. 18 క్యారెట్‌ నగలా అన్న విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఆనగలపై హాల్‌ మార్క్‌తో పాటు నగల స్వచ్ఛతను చూపించే ముద్ర ఉంటుంది. 22k అని ముద్రించి ఉంటుంది.

బంగారంలో 22 క్యారెట్లు, 24 క్యారెట్లలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు అనేవి కొందరికి తెలిసినా.. కొందరికి తెలియదు. ఈ రెండింటికి తేడాలు ఏమిటో బంగారం కొనుగోలు చేసేవారికి ఎక్కువగా తెలుస్తుంటుంది. కానీ కొందరికి మాత్రం ఈ క్యారెట్ల విషయంలో చాలా అనుమానాలుంటాయి. క్యారెట్‌ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్‌ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుంది. ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు. అయితే పసిడి ఎంతో సున్నితమైనది. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్‌ తెలుపుతుంది.

24 క్యారెట్ల బంగారం: ఈ క్యారెట్‌లో బంగారం 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. 24 క్యారెట్ల బంగారానికి మించిన బంగారం ఉండదు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ఖరీదైనది. ఈ బంగారు సున్నితమైనది. ఇందులో ఏ ఇతర లోహం కలిసి ఉండదు. కేవలం బంగారమే ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అని చెబితే అందులో 99.99 శాతం బంగారమే ఉంటుందని గుర్తించాలి. దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు. 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉంటుంది. అయితే ఈ క్యారెట్‌లో 100 శాతం బంగారం ఉండవచ్చు కదా.. అని అనుమానం రావచ్చు.అయితే 100 శాతం స్వచ్ఛత ఉన్న బంగారం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద చాలా మృదువుగా, పెళుసుగా ఉంటుంది. ఒక ఆకారంలోఉండదు. అందుకే బంగారాన్ని వెలికి తీసిన తర్వాత 99.99శాతం స్వచ్ఛత వచ్చే విధంగా చేస్తారు. ఇదే అత్యంత స్వచ్ఛమైన బంగారమని భావించాలి.

22 క్యారెట్ల బంగారం: ఈ క్యారెట్ల బంగారంలో రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం కంటే ఇది హార్డ్‌గా ఉంటుంది. ఆభరణాల తయారీకి ఇది అనువైంది. ఇది 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం. ఈ బంగారాన్ని 916 బంగారం అని కూడా పిలుస్తుంటారు. ఈ బంగారానికి ఇతర లోహాలు కలపడం వల్ల గట్టి పడుతుంది.

18 క్యారెట్ల బంగారం: 18 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. ఇందులో ఉండే బంగారంలో ఆరు భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి. దీనిని 750 బంగారం అని కూడా పిలుస్తుంటారు.18 క్యారెట్ల బంగారంలో 75 శాతం పసిడి, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత హార్డ్‌గా, మన్నికగా ఉంటుంది. ఇన్వెస్ట్‌ మెంట్‌ కోసం అయితే 24 క్యారెట్ల బంగారం వైపు మొగ్గు చూపుతుంటారు. డైమండ్‌ జువెలరీ తయారీలో 18కే బంగారం ఎక్కువగా వాడతారు. 18 క్యారెట్ల బంగారం కన్నా 22 క్యారెట్ల బంగారం ధర ఎక్కువగా ఉంటుంది.

14 క్యారెట్ల బంగారం: ఈ క్యారెట్‌ బంగారంలో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర తక్కువ ఉంటుంది. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా లభ్యం అవుతుంది. బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును బట్టి గుర్తించవచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతోపాటు డార్కిష్‌గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసేకొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Gas Cylinder: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో గ్యాస్‌ సిలిండర్లు.. కేంద్రం కీలక నిర్ణయం..!

Dhanteras: ధన త్రయోదశి రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు..? పసిడితో పాటు ఇవి కూడా కొంటే మంచిదేనట..!

ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌
ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌
బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
కేంద్ర మంత్రులతో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా చూసిన ప్రధాని మోడీ
కేంద్ర మంత్రులతో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా చూసిన ప్రధాని మోడీ
తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా