Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!

Post Office Scheme: వివిధ రకాల స్కీమ్‌ల ద్వారా అధిక రాబడి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక బ్యాంకుల మాదిరిగానే..

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Nov 02, 2021 | 9:50 AM

Post Office Scheme: వివిధ రకాల స్కీమ్‌ల ద్వారా అధిక రాబడి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులలో రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాటిల్లో అత్యంత సురక్షితమైనవి పోస్టాఫీసులు అందించే పెట్టుబడి పథకాలు. ఈ స్కీమ్‌ల ద్వారా మంచి రాబడి పొందవచ్చు. పోస్టాఫీసు ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో గ్రామ సుమంగళ్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీనిని 1995లోనే ప్రవేశపెట్టారు. ఇందులో వివిధ రకాల పెట్టుబడి మొత్తంతో కూడిన ఆరు బీమా ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో రోజూ రూ.95 పెట్టుబడితో 20 ఏళ్లలో రూ.14 లక్షలు పొందవచ్చు.

ఈ స్కీమ్‌లో రెండు ఆప్షన్లు..

ఈ స్కీమ్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలపరిమితితో అందుబాటులో ఉంది. 19-45 సంవత్సరాల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.15 ఏళ్ల పాటు పాలసీలో మనీ బ్యాక్‌ ఆప్షన్‌ ఉంది. పాలసీ తీసుకున్న తర్వాత 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 20 శాతం మొత్తాన్ని పాలసీదారుడు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన 40 శాతం మొత్తాన్ని మెచురిటీపై బోనస్‌గా పెట్టుబడిదారులకు అందిస్తారు. అదే 20 సంవత్సరాల పాలసీ అయితే 20 శాతం చొప్పున 8వ సంవత్సరంలో, 12వ సంవత్సరంలో, 16వ సంవత్సరంలో చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని మెచురిటీపై బోనస్‌గా అందజేస్తారు.

మరి రూ. 14 లక్షలు పొందటం ఎలా?

25 సంవత్సరాల వ్యక్తి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ హామీ కోసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టారనుకుంటే.. వారు ప్రతి నెల రూ.2853 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది రోజుకు సుమారు రూ.95గా ఉంటుంది. ఈ స్కీమ్‌ కింద 8వ సంవత్సరం, 12వ సంవత్సరం, 16వ సంవత్సరం పెట్టుబడిదారులకు 20 శాతం చొప్పున.. అంటే రూ.1.4 లక్షల చొప్పున తిరిగి చెల్లిస్తారు. చివరగా 20వ సంవత్సరంలో రూ.2.8 లక్షలు హామీపూరిత మొత్తంగా అందుతాయి.

బోనస్ రూపంలో..

ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన ప్రతి రూ.1000కి రూ.48 బోనస్‌గా చెల్లిస్తారు. అంటే రూ.7 లక్షలకు ప్రతి సంవత్సరం బోనస్‌ రూపంలో రూ.33,600 అందుతుంది. మొత్తం 20 సంవత్సరాలకు ఈ బోనస్‌ రూ.6.72 లక్షలు అవుతుంది. అంటే రూ.7 లక్షల హామీపూరిత మొత్తం, ఈ బోనస్‌ రూ.6.72 లక్షలు కలిస్తే 20 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులు రూ.13.71 లక్షలు అందుకుంటారన్నమాట. ఇందులో రూ.4.2 లక్షలు మనీ బ్యాక్‌గా ముందే అవకాశం ఉంటుంది. ఇక చివరిలో బోనస్‌, మిగిలిన మొత్తం రూ.9.52 లక్షలు అందుకుంటారు. ఒకవేళ మెచ్యూరిటీకి ముందే పెట్టుబడిదారులు మరణిస్తే.. హామీపూరిత మొత్తంతో పాటు బోనస్‌ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. ఇలా పోస్టాఫీసులో ఇలాంటి స్కీమ్స్‌ ఎన్నో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అయితే ఇవి అవగాహన కోసం మాత్రమే. వివిధ నివేదికలు, వెబ్‌సైట్ల ఆధారంగా వివరాలు అందజేయడం జరుగుతుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసును సందర్శించి తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Gas Cylinder: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో గ్యాస్‌ సిలిండర్లు.. కేంద్రం కీలక నిర్ణయం..!

Ola Car Offer: మీరు కారు కొనాలనుకుంటున్నారా..? కస్టమర్లకు ‘ఓలా’ అదిరిపోయే ఆఫర్‌.. లక్ష వరకు తగ్గింపు..!