Dhanteras: ధన త్రయోదశి రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు..? పసిడితో పాటు ఇవి కూడా కొంటే మంచిదేనట..!

Dhanteras: పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని 'ధన్‌రాస్' లేదా 'ధన త్రయోదశి' లేదా 'చోటీ దివాళీ' అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని..

Dhanteras: ధన త్రయోదశి రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు..? పసిడితో పాటు ఇవి కూడా కొంటే మంచిదేనట..!
Dhanteras
Follow us
Subhash Goud

|

Updated on: Oct 24, 2021 | 9:01 AM

Dhanteras: పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్‌రాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘చోటీ దివాళీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. ఈ ఏడాది నవంబర్‌ 2న మంగళవారం ధంతేరస్. దీపావళి ధంతేరస్ పండుగ నుండే ప్రారంభమవుతుంది. ఈ రోజున ధన్వంతరి ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీనితో పాటు, కుబేరుడు, లక్ష్మీ పూజ చేస్తారు. ఈ రోజున, సముద్ర మథనం సమయంలో, ధన్వంతరి భగవానుడు చేతిలో కలశంతో దర్శనమిచ్చాడని ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున ధంతేరస్ నిర్వహించుకుంటారు. ఆ రోజున ప్రజలు బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు మొదలైన వాటిని శుభ సమయంగా భావించి కొనుగోలు చేస్తారు. ధరలు కూడా భారీగానే పెరుగుతుంటాయి. అయితే ధనత్రయోదశి నాడు కొత్త వస్తువులు కొనడం అనేది సంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయడంతో అమ్మవారు ఇంటికి వస్తారు నమ్ముతారు. అందువల్ల దంతేరాస్ నాడు చాలా మంది మహిళలు బంగారమో, వెండివస్తువులనో కొనుగోలు చేస్తారు. మరి ధంతేరస్ రోజున ప్రజలు తరచుగా అనేక వస్తువులను కోనుగోలు చేస్తుంటారు. మరి ధంతేరస్ రోజున ఎలాంటి షాపింగ్ చేయాలో తెలుసుకుందాం.

బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం:

ధంతేరస్ రోజున బంగారం, వెండిని కొనడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు ప్రజలు. ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువులు అనేక రెట్లు పెరుగుతాయని చెబుతారు. ఇది మాత్రమే కాదు, మీరు ఈ రోజు వెండి లక్ష్మి-గణేష్ నాణేలను కూడా కొనుగోలు చేయవచ్చు.

చీపురు కొనడం:

ధంతేరస్ రోజున చీపురు కొనడం కూడా శుభప్రదంగా భావిస్తుంటారు కొందరు. చీపురు అంటే లక్ష్మి రూపంగా భావిస్తారు. ఈ రోజు చీపురు కొనడం వల్ల పేదరికం, కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా దూరమవుతాయని నమ్ముతుంటారు.

వాహనం కొనుగోలు:

ఏదైనా వాహనం కొనడం శుభప్రదంగా భావిస్తుంటారు. అందుకే మీరు కారు, బైక్ లేదా స్కూటర్ మొదలైనవి కొనాలని ఆలోచిస్తుంటే, మీరు దానిని కొనుగోలు చేయవచ్చు.

లక్ష్మీ , గణేష్ విగ్రహం:

మీరు దీపావళి రోజున పూజించబడే లక్ష్మీ, గణేష్ ధంతేరస్ రోజున మాత్రమే కొనుగోలు చేయాలి. ఆ రోజున లక్ష్మీ, గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేయడం ఎంతో మంచిదంటుంటారు.ఇలా కొనుగోలు చేస్తే మీకు అదృష్టం, సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.

ఇత్తడి- రాగి వస్తువులు:

ధన్వంతరికి ఇత్తడి అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. కాబట్టి, ఈ రోజు ఇత్తడి వస్తువులను కొనడం శ్రేయస్కరం. అందుకే చాలా మంది ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు.

ఈ పర్వదినం రోజున ఏం చేయాలి?

బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. స్నానాదులు ముగించిన తరువాత, ఏమీలేని పేదలకు భోజనమో, వస్త్రమో, రొక్కమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలని చెబుతున్నారు పండితులు. స్వర్ణపుష్పాలు లేనప్పుడు, బంగారమంటి మనసుతో అర్చించినా లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Sovereign Gold Bond scheme: అక్టోబర్‌ 25 నుంచి సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌.. తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు

Gold Price Today: పండగ సీజన్‌లో షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన రేట్లు.. 10 గ్రాముల ధర ఎంతంటే..!