Sukmawati: పుట్టిన రోజున హిందూ మతాన్ని స్వీకరించనున్న ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడి తనయ

Sukmawati: ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం ఇండోనేషియా.. భారత్ - చైనా , ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ , ఫసిఫిక్ సముద్రాల్లో..

Sukmawati:  పుట్టిన రోజున హిందూ మతాన్ని స్వీకరించనున్న ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడి తనయ
Sukmawati
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2021 | 8:35 AM

Sukmawati: ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం ఇండోనేషియా.. భారత్ – చైనా , ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ , ఫసిఫిక్ సముద్రాల్లో విస్తరించిన ఇండోనేషియా ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం. ఈ నేలపై ఇప్పుడు ముస్లింలు అధికంగా ఉన్నా.. ఒకప్పుడు హిందూ, బౌద్ధ మతాలు విలసిల్లాయి. ఇప్పటికీ ఇక్కడ హిందూ దేవుళ్ళకు హిందూ మత చరిత్రకు ప్రముఖ స్థానం ఉంది. ఇంకా ఇండోనేషియాలోని కళలపై అనేక సంస్కృతుల ప్రభావం ఉంది. ప్రఖ్యాత ‘జావనీ’ నృత్యాలు, హిందూ సంప్రదాయాలను సంస్కృతులనూ కలిగి ఉంది. తాజాగా అంత్జతీయంగా హిందూ మత అంశంతో మళ్ళీ ఇండోనేషియా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు, మొదటి రాష్ట్రపతి సుకర్ణో కూతురు దియా ముతియారా సుక్మావతి సుకర్నోపుత్రి ఇస్లాం మతం నుంచి సనాతన హిందూ మతంలోకి మారాబోతున్నారు.

ఇండోనేషియా నేషనల్ పార్టీ వ్యవస్థాపకురాలైన 69 ఏళ్ల సుక్మావతి సుకర్నోపుత్రి దేశ ఐదో అధ్యక్షుడు మేగావతి సుకర్నోపుత్రికి సహోదరి. తాజాగా సుక్మావతి హిందూ మతాన్ని స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా అక్టోబర్ 26 న సాంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలోఆమె హిందూ మతాన్ని స్వీకరించబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి పలువురుని ఆహ్వానిస్తూ ఆహ్వానపత్రాన్ని విడుదల చేశారు. సుక్మావతి పుట్టిన రోజైన ఈ నెల 26న సంతాన హిందూ ధర్మంలోకి హిందూ సంప్రదాయం ప్రకారం సుధి వదానీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉత్తర బాలిలోని తన దివంగత తండ్రి స్మారకార్థం నిర్మించిన భవంతిలో జరగనుంది. సుక్మావతి నానమ్మ ఇదా అయు నోమన్ రాయి శ్రింబెన్ చూసి ఇన్స్పిరేషన్ తో హిందూ మతాన్ని సుక్మావతి స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సుక్మావతికి హిందూ పురాణాలపై మంచి పట్టు ఉన్నదని, హిందూ మతానికి చెందిన ఎన్నో గ్రంథాలను సుక్మావతి  అవపోసాన పట్టారని లాయర్ వివరించారు. హిందూ మత స్వీకరణ గురించి ఎంతో ఆలోచింఛి .. తన నిర్ణయానికి కుటుబం సభ్యుల ఆమోదం లభించిన తర్వాతనే హిందూ మతాన్ని స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుక్మావతి మత మార్పిడి నిర్ణయానికి ఆమె సోదరులు, సహోదరి, ఆమె సంతానమూ సమ్మతించారని లాయర్ చెప్పారు.

Also Read:  : రేపటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే