TS Inter Exams: రేపటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

Telangana Inter Exams:తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి జరగనున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు..

TS Inter Exams: రేపటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
Ts Inter Exams
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2021 | 7:46 AM

Telangana Inter Exams:తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి జరగనున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం (అక్టోబర్ 25) నుంచి నవంబర్‌ 2వ తేదీ (మంగళవారం) వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు కరోనా నిబంధనలు అనుసరిస్తూ.. ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా 2020-21 విద్యాసంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేసింది. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ కు మార్కులను పెంచి మెమోలు ఇచ్చింది. అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు మాత్రం పరీక్షలను నిర్వహించలేదు. అయితే తాజాగా కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడంతో.. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి కొత్తగా మొబైల్ యాప్ ను వినియోగంలోకి తీసుకుని రానున్నారు. ఓఎంఆర్‌ షీట్‌లో మాల్‌ప్రాక్టీస్‌, బ్లాంక్‌ బార్‌ కోడ్‌, ఆబ్సెంట్‌, డ్యామేజ్‌, బార్‌కోడ్‌, ఎయిడెడ్‌ క్యాండిడేట్స్‌ వంటి సేవలను యాప్‌ అందించనుంది. ఇక బెంచీకి ఒకరు చొప్పున మాత్రమే కూర్చునేలా సిట్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. నిమిషయం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతి ఇవ్వమని అధికారులు తెలిపారు. ఇక పరీక్ష నిర్వహించనున్న కేంద్రాల్లో అధికారులు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించనున్న ప్రైవేట్‌, పాఠశాల కేంద్రంలో విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం పై దృష్టి సారించారు. ఇప్పటికే పరీక్ష నిర్వహించే కాలేజీలను తగిన విధంగా శానిటేషన్‌ చేశారు. ఇక కరోనా వైరస్ నిబంధనలను అనుసరిస్తూ పరీక్షా కేంద్రాలను రెడీ చేస్తున్నారు. ఇక విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రం వివరాలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.

Also Read:  ఈరోజు వ్యవసాయంతో లాభాలను పొందే రాశివారు ఎవరంటే.. ఏఏ రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..