Chiranjeevi: తన అభిమానిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించిన చిరు.. అవసరమైతే మెరుగైన చికిత్స చెన్నై తరలించడానికి రెడీ అని హామీ
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఒక్క చిరు పిలుపుతో స్పందించే అభిమానులు ఎందరో.. అందుకే..
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఒక్క చిరు పిలుపుతో స్పందించే అభిమానులు ఎందరో.. అందుకే చిరంజీవి తన అభిమానులను బ్లడ్ బ్రదర్స్ అని పిలుస్తారు. అంతేకాదు చిరంజీవి తన అభిమానులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు.. అదే వారసత్వాన్ని మెగా హీరోలు కూడా కొనసాగిస్తున్నారు. చిరు ఎలా అభిమానులను సొంత ఇంటి మనుషుల్లా చూస్తూ.. ఆపద సమయంలో అండగా నిలబడతారో… అదే విధంగా మెగా హీరోలు తమ ఫ్యాన్స్ ను గౌరవిస్తారు. అవసరమైనప్పుడు మేమున్నామని ఆర్ధికంగా ఆదుకుని అండగా నిలబడతారు. అందుకే మెగా ప్యామిలీని.. చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా చిరు చేసిన పని మెగా అభిమానులనే కాదు.. తెలుగు సినీ ప్రేక్షకుల మనసుని కూడా హత్తుకుంది. తన అభిమాని తనని చూడడానికి రావడానికి అనారోగ్యంతో బాధపడుతుంటే.. ప్లైట్ టికెట్ బుక్ చేసి ఫ్యామిలీని తన ఇంటికి పిలిపించుకున్నారు.. స్వయంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాదు.. చికిత్స కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫేమస్ ఆస్పత్రికి తరలించారు. అవరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి ఎవరా అభిమాని .. వివరాల్లోకి వెళ్తే..
విశాఖకు చెడిన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే తనకు చిరంజీవిని కలవాలని ఉందని ట్విట్టర్ ద్వారా వెంకట్ కోరికను తెలియజేశాడు. ఈ విషయం చిరంజీవి దృష్టికి చేరుకుంది. వెంటనే స్పందించిన చిరంజీవి.. వెంకట్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తనను కలవాల్సిందిగా చెప్పారు. అయుఇతే నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా చిరంజీవిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు.
అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం.. తన అభిమాన హీరో చిరంజీవి నుంచి కలవమని పిలుపు వచ్చింది.. అయితే తాను ప్రస్తుతం కలవలేని పరిస్థితిలో ఉన్నానని వెంకట్ బాధపడ్డారు. వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేదని చిరంజీవి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మళ్ళీ చిరంజీవి ఎలాగైనా వెంకట్ ను కలవాలను కున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాదు రావడానికి వెంకట్, వెంకట్ భార్య సుజాతకు ఫ్లైట్ టికెట్స్ చిరంజీవి పంపించారు. వెంకట్ ను హైదరాబాద్ రప్పించారు. వెంకట్ ఆయన భార్య సుజాత చిరంజీవి ఇంట్లో కలిసారు. ఇద్దరితోనూ చిరంజీవి దాదాపు 45 నిమిషాలు గడిపారు. వెంకట్ అనారోగ్యానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ రిపోర్ట్స్ పై సెకండ్ ఒపినియన్ తీసుకున్న చిరంజీవి.. వెంకట్ ను హైదరాబాద్ లో ఒమేగా ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ చేశారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు.. తన అభిమానికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్య సిబ్బందికి చిరంజీవి చెప్పారు. అవసరమైతే మెరుగైన వైద్య కోసం చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి వెంకట్ కు వైద్యం అందించానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ ఉన్నారని తెలుస్తోంది. తన అభిమాని వెంకట్ ను కాపాడుకోవడం కోసం ఖర్చుకు ఆలోచించేది లేదని సుజాతకు చిరంజీవి దైర్యం చెప్పి.. భరోసా కల్పించారు.
ఇప్పుడు మెగాస్టార్ తన అభిమాని ప్రాణాలు కాపాడడం కోసం చిరంజీవి పడుతున్న ఆరాటానికి మెగా ఫ్యాన్స్ మళ్ళీ ఫిదా అయ్యారు. దటీజ్ మెగాస్టార్ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ త్వరగా కోలుకుని సంతోషంగా జీవించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: పుట్టిన రోజున హిందూ మతాన్ని స్వీకరించనున్న ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడి తనయ