Sree Leela : మెగా కాంపౌండ్‌లోకి ‘పెళ్లి సందD’ హీరోయిన్.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..

మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది అందాల శ్రీలీల. కన్నడలో పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నది..

Sree Leela : మెగా కాంపౌండ్‌లోకి 'పెళ్లి సందD' హీరోయిన్.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..
Sree Leela
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2021 | 9:33 AM

Sree Leela : మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది అందాల శ్రీలీల. కన్నడలో పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరెకెక్కిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదలైన దగ్గర నుంచే శ్రీలీల కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇక ఆతర్వాత విడుదలైన టీజర్, ట్రైలర్, పాటల్లో ఈ అమ్మడిని చూసిన కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు.

అందంతో అంతకు మించిన చలాకీ తనంతో ఆకట్టుకుంది శ్రీలీల. ఇక పెళ్లి సందD సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాస్ రాజా రవితేజ త్రినాధ్ రావు నక్కిన కాంబినేషన్ లో రాబోతున్న ధమాకా సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్రది మెగా కాంపౌండ్ లోకి అడుగుపెడుతుందని టాక్ వినిపిస్తుంది. త్వరలో శ్రీలీల ఓ మెగా హీరో సరసన నటించనుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో శ్రీలీల జతకట్టనుంది అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor: ‘మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీమ్ పై ప్రశంసలు కురిపించిన నాగార్జున..

Hug Scenes Ban: ఇక కౌగిలింతల సీన్లు కనిపించవు.. కఠిన ఆంక్షలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం

Bandla Ganesh: “ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా”.. ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరన్న బండ్లగణేష్..