Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda : ఇండియాని షేక్ చేయబోతున్నాం.. ఫిక్స్ అయిపోండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.

Vijay Devarakonda : ఇండియాని షేక్ చేయబోతున్నాం.. ఫిక్స్ అయిపోండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్
Vijay
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2021 | 9:49 AM

Vijay Devarakonda  : యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాకు అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రొమాంటిక్ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవలే వ‌రంగ‌ల్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు లైగ‌ర్‌ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. “నేను వచ్చినప్పుడల్లా అభిమానులు ప్రేమ చూపిస్తే నాకు థాంక్యూ ఎలా చెప్పాలో తెలియదు అన్నారు. అలాగే మళ్ళీ లైగర్ కి వరంగల్  రాగలుగుతా. ఎట్లాగూ పూరి సహా అందరూ ప్రామిస్ చేశారు. మీకు థాంక్యూ చెప్పగలిగే ఒకే విధానం. మళ్ళీ నా ఫంక్షన్ కి ఇక్కడికి రావడమే. ఇక్కడికి వస్తే మొత్తం నా లైగర్ సెట్ కి వచ్చినట్టుంది అన్నారు.  అంతా మా లైగర్ టీమ్. వీళ్లంతా చాలా హెల్దీగా, సంతోషంగా ఉండాలి. వీళ్ళెంత హ్యాప్పీగా ఉంటే లైగర్ పనులు అంత వేగంగా జరుగుతాయి. మనస్ఫూరిగా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు విజయ్.

మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గురించి మాట్లాడుతూ.. సునీల్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కేతిక చాలా బాగుంది. సూపర్ ఇంటెలిజెంట్ ఆమె..కేతికకు మంచి ఫ్యూచర్ ఉంది అన్నారు విజయ్. ఇక   హీరో ఆకాష్ గురించి మాట్లాడుతూ.. అతనిలో ఓ ఫైర్ ఉంది. దాన్ని ఇప్పుడు చేసి చూపించాలి. మీ నాన్న కాలర్ ఎత్తాలి అన్నారు. ఆకాష్ కి సినిమా పిచ్చి చాలా ఎక్కువట. సినిమా బాగా లేకపోయినా చూసి పాజిటివ్‌గానే చెబుతారట. అలాంటి వారు ఉండాలి. ఆకాష్ సక్సెస్ కొడతాడని నమ్ముతున్నా అన్నారు . ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్, రైటర్లు పూరి గారు ఛార్మి గారంటే నాకు ఇష్టం. మీ అందరికీ లైగర్ సినిమా గురించి ఓ క్లారిటీ ఇద్దామనుకున్నా. డెస్టినీ పూరి గారిని మా లైఫ్ లోకి తీసుకొచ్చింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. లైగర్ సినిమాలోని ఒక్క విజువల్ చూస్తే అది మీకే అర్థమవుతుంది. మేము ఒక్కటే ఫిక్సయ్యాం. 2022లో లైగర్ తో ఇండియాని షేక్ చేయాలె. ఫిక్స్ అయిపోండి. అక్టోబర్ 29న రొమాంటిక్, 2020లో లైగర్‌తో వస్తున్నాం’ అని అన్నారు విజయ్ దేవకొండ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor: ‘మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీమ్ పై ప్రశంసలు కురిపించిన నాగార్జున..

Hug Scenes Ban: ఇక కౌగిలింతల సీన్లు కనిపించవు.. కఠిన ఆంక్షలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం

Bandla Ganesh: “ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా”.. ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరన్న బండ్లగణేష్..