Dulquer Salmaan’s Kurup : క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే దుల్కర్ ‘కురుప్’.. రిలీజ్ ఎప్పుడంటే..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్.

Dulquer Salmaan’s Kurup : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత దుల్కర్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాలో శివాజీ గణేషన్ పాత్రలో దుల్కర్ నటన అద్భుతమనే చెప్పాలి. ఇప్పుడు ”కురుప్” అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు దుల్కర్ . శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ సమర్పణలో డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు దుల్కర్. ఇప్పటికే విడుడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
వివిధ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, పోస్టర్ ను వదిలారు. ఇంద్రజిత్ సుకుమారన్.. సన్నీ.. శోభిత ధూళిపాళ.. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. పోస్టర్ చూస్తుంటే కథలో అనేక పాత్రలు.. అనూహ్యమైన మలుపులు ఉంటాయనే విషయం అర్థమవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :