AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal : పెళ్లయినా కాజల్ ఫాలోయింగ్ ..క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం..

కాజల్ అగర్వాల్.. ఏ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరేమో.. అందం అభినయంతో ఈ బ్యూటీ కుర్రకారును కట్టిపడేసింది.

Kajal Aggarwal : పెళ్లయినా కాజల్ ఫాలోయింగ్ ..క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం..
Kajal New
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2021 | 12:10 PM

Share

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరేమో.. అందం అభినయంతో ఈ బ్యూటీ కుర్రకారును కట్టిపడేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది కాజల్. ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ లిస్ట్‌లోకి చేరిపోయింది. మగధీర సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంది కాజల్.. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‌గా మారింది కాజల్. స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచింది కాజల్. ఇక తెలుగుతోపాటు తమిళ్‌లోనూ సినిమాలు చేసింది ఈ చందమామ .

మరో వైపు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ఈ మధ్య తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును వివాహమాడింది కాజల్. ప్రస్తుతం కాజల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర వరకు షూటింగ్ ను పూర్తి చేసింది కాజల్. ప్రస్తుతం కాజల్ గర్భవతి అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే ఆమె సినిమాలను తగ్గించిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కాజల్ ఫాలోవర్స్ 20 మిలియన్ల (2కోట్లు)కు చేరుకున్నారు. పెళ్లయినా కాజల్ ఫాలోయింగ్ ..క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని దీని చూస్తే అర్ధమవుతుంది.

Kajal

మరిన్ని ఇక్కడ చదవండి : 

>Vijay Devarakonda : ఇండియాని షేక్ చేయబోతున్నాం.. ఫిక్స్ అయిపోండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్

Sree Leela : మెగా కాంపౌండ్‌లోకి ‘పెళ్లి సందD’ హీరోయిన్.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..

Chiranjeevi: తన అభిమానిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించిన చిరు.. అవసరమైతే మెరుగైన చికిత్స చెన్నై తరలించడానికి రెడీ అని హామీ