Hug Scenes Ban: ఇక కౌగిలింతల సీన్లు కనిపించవు.. కఠిన ఆంక్షలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ హైవోల్టేజ్‌ హీట్‌ పెంచుతుంటే.. తమ దేశంలో సీరియల్స్‌లో ఆ సీన్లకు అవకాశం లేదని ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్ చెబుతోంది. ఆ సీన్ల ఇక నుంచి సీరియళ్లలో కట్‌ అంటోంది. సీరియల్స్‌పై పాకిస్తాన్‌...

Hug Scenes Ban: ఇక కౌగిలింతల సీన్లు కనిపించవు.. కఠిన ఆంక్షలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం
Ban
Follow us

|

Updated on: Oct 24, 2021 | 8:51 AM

Pakistan – Hug Scenes Ban: పాకిస్తాన్‌తో మ్యాచ్‌ హైవోల్టేజ్‌ హీట్‌ పెంచుతుంటే.. తమ దేశంలో సీరియల్స్‌లో ఆ సీన్లకు అవకాశం లేదని ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్ చెబుతోంది. ఆ సీన్ల ఇక నుంచి సీరియళ్లలో కట్‌ అంటోంది. సీరియల్స్‌పై పాకిస్తాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. ఇప్పుడది సీరియల్స్‌ కూడా అంటుకుంది. దీంతో ఇక నుంచి ఆ సీన్లకు చెక్‌పెట్టింది పాకిస్తాన్. టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్‌లో హగ్ సీన్స్, రోమాన్స్‌ సన్నివేశాలు ప్రసారం చేయకూడదని ఆదేశించింది. పాకిస్తాన్‌ ఎలాక్ట్రానిక్‌ మీడియా రెగ్యూలేటరి అథారటీ-PEMRA ఉత్తుర్వులు జారీ చేసింది.

సీరియల్స్‌లో ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా ప్రసారం అవుతుండటంతో ఫిర్యాదులు వచ్చాయని పెమ్రా స్పష్టం చేసింది. ఇలాంటి సన్నివేశాలు ప్రసారం చేసే సీరియల్స్‌ పాకిస్తాన్‌ సమాజానికి పూర్తి వ్యతిరేకమని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కౌగిలించుకోవడం, ఒకరినొకరు లాలించడం, వివాహేతర సంబంధాలు, బెడ్‌రూమ్ సీన్స్, భార్యభర్తల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు, అసభ్యకరంగా దుస్తులు ధరించడం సీన్లు ఇస్లామిక్ బోధనలు, పాకిస్తానీ సమాజం సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కిందకు వస్తుంది.

ఇలాంటి సీరియల్స్‌ని ప్రసారం చేసే ముందు ఆయా చానెల్స్‌ ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకుని.. అసభ్యతకు తావులేదని భావించిన తర్వాతే ప్రసారం చేయాలని పెమ్రా నోటిఫికేషన్‌లో వివరించింది. ఈ గైడ్‌లైన్స్‌ను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తుండగా.. మరికొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెమ్రా నిర్ణయం సరైంది, వివాహిత జంటల మధ్య సాన్నిహిత్యం, ఆప్యాయత పాకిస్తానీ సమాజంలో ఉండదు అంటూ పెమ్రా నోటిఫికేషన్‌పై లీగల్, హ్యూమన్ రైట్స్ ప్రొఫెషనల్ రీమా ఒమర్ కామెంట్ చేశారు. దీనిపై ఇంకా మరికొన్ని వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Viral Video: షోరూమ్ బయట రోడ్డుపై కూర్చొని టీవీ చూస్తున్న చిన్నారులు.. వైరల్ అవుతున్న భావోద్వేగ దృశ్యం..

Goa Assembly Election 2022: హీటెక్కిన గోవా పాలిటిక్స్.. బీజేపీని దెబ్బకొట్టేందుకు రాష్ట్రంలోకి మమతా బెనర్జీ ఎంట్రీ

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?