Goa Assembly Election 2022: హీటెక్కిన గోవా పాలిటిక్స్.. బీజేపీని దెబ్బకొట్టేందుకు రాష్ట్రంలోకి మమతా బెనర్జీ ..
ఎన్నికలకు మరో ఏడాది మిగిలి ఉండగానే గోవా పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ అంటుంటే..
ఎన్నికలకు మరో ఏడాది మిగిలి ఉండగానే గోవా పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ అంటుంటే.. అభివృద్ధికి గోవా నమూనా కావాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈనెల 28 నుంచి రెండు రోజులపాటు గోవా పర్యటనకు సిద్ధమైన మమతా బెనర్జీ.. బెంగాల్ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈనెల 28న గోవాలో నా తొలి పర్యటనకు సిద్ధమయ్యారు. బీజేపీని ఓడించేందుకు ప్రజలు, సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. గత పదేళ్లుగా గోవా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ట్వీట్ చేశారు మమతా బెనర్జీ. వచ్చే ఏడాది జరిగే గోవా శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ గతంలోనే ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ గోవాలో టీఎంసీ భారీ స్థాయిలో అడుగుపెడుతుందని ఆ పార్టీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో గోవా మాజీ సీఎం లుజినో ఫలైరోతో సహా కొంతమంది కాంగ్రెస్ నేతలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
మరోవైపు గోవాపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. అభివృద్ధికి నూతన నమూనా గోవా అంటూ ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం గురించి వివరిస్తూ స్వయం సమృద్ధ భారత్‌కు అవసరమైనవన్నీ గోవాకు ఉన్నాయన్నారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కేంద్రంలోనూ, గోవాలోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్న విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. స్వయంపూర్ణ పథకానికి ఉండే అతి పెద్ద బలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒకటని చెప్పారు. ఫిష్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో గోవా దేశానికి ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి: Viral Video: షోరూమ్ బయట రోడ్డుపై కూర్చొని టీవీ చూస్తున్న చిన్నారులు.. వైరల్ అవుతున్న భావోద్వేగ దృశ్యం..