Viral Video: షోరూమ్ బయట రోడ్డుపై కూర్చొని టీవీ చూస్తున్న చిన్నారులు.. వైరల్ అవుతున్న భావోద్వేగ దృశ్యం..

Viral Video: ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంలా మారింది. ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో ప్రజలకు సమాచారం చేరిపోతోంది. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో..

Viral Video: షోరూమ్ బయట రోడ్డుపై కూర్చొని టీవీ చూస్తున్న చిన్నారులు.. వైరల్ అవుతున్న భావోద్వేగ దృశ్యం..
Viral
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 24, 2021 | 6:48 AM

Viral Video: ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంలా మారింది. ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో ప్రజలకు సమాచారం చేరిపోతోంది. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది చూస్తే తప్పకుండా భావోద్వేగానికి గురవుతారు. వైరల్ అవుతన్న ఈ వీడియోలో.. ఇద్దరు పిల్లలు ఎలక్ట్రానిక్ స్టోర్ బయట కూర్చొని టీవీ చూస్తున్నారు. అనాథలా మరేంటో తెలియదు గానీ.. ధీన స్థితిలో వారిద్దరూ స్టో్ర్ బయట కూర్చుని టీవీలో వచ్చే కార్యక్రమాలను వీక్షించారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ‘‘ఈ పిల్లల పరిస్థితని చూసిన తరువాత నా కళ్లలో నీళ్లు వచ్చాయి.’’, ‘పిల్లలు తమ ఆనందాన్ని చాలా చిన్న విషయాలలో కనుగొంటారు’, ‘ఈ పిలలు ఎంత అమాయకులు. భవిష్యత్‌లో ఆ స్టోర్‌కి వారే యజమానులు కావాలి.’ అంటూ ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోనే బిహార్ న్యూస్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 20 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది లైక్స్ వచ్చాయి. హృదయానికి హత్తుకునేలా ఉన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Viral Video:

Also read:

Garuda Garvabhangam: బాధ్యత గర్వంగా మారి తలకెక్కితే గర్వభంగం తప్పదని తెలియజెప్పే గరుత్మంతుడు కథ

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బెస్ట్ కపుల్‌‌‌‌గా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. వాళ్ళు ఎవరంటే..

Silver Price Today: పరుగులు పెడుతున్న వెండి.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా పెరిగింది..!