Bandla Ganesh: “ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా”.. ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరన్న బండ్లగణేష్..
నటుడిగా స్టార్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేష్. ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమైన బండ్ల గణేష్ రాజకీయాల్లో రాణించాలని చూసారు.
Bandla Ganesh: నటుడిగా స్టార్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేష్. ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమైన బండ్ల గణేష్ రాజకీయాల్లో రాణించాలని చూసారు. కానీ అది కుదరలేదు.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోబిజీగా కావాలని చూస్తున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నానని బండ్ల గణేష్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ స్వామీజీ జీవిత కథను నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
బండ్ల గణేశ్ మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు. స్వామి తన జీవితచరిత్రను సినిమాగా తీయాలని ఆదేశించారని తెలిపారు. ” అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు..” అంటూ బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు..? pic.twitter.com/JqqY06pvTt
— BANDLA GANESH. (@ganeshbandla) October 24, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :