Radhe Shyam: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న డార్లింగ్.. నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..

చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్‌లో చేస్తున్న సినిమా "రాధే శ్యామ్‌". ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా..

Radhe Shyam: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న డార్లింగ్.. నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2021 | 8:20 AM

Radhe Shyam: చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్‌లో చేస్తున్న సినిమా “రాధే శ్యామ్‌”. ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్‌లో కనిపించబోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇది గొప్ప ప్రేమ‌క‌థ గా మెష‌న్ పోస్ట‌ర్ ద్వారా రివీల్ అయ్యింది. విక్ర‌మాదిత్య ఎలా వుండ‌బోతున్నాడు..? ఏం చేయ‌బోతున్నాడు?. విక్ర‌మాదిత్య ఎవ‌రు..? అనే ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం గా రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్య గా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీ లో జ‌రిగే ప్రేమ‌క‌థ గా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్.

”నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు దగ్గరి నుంచి నాకు అన్నీ తెలుసు కానీ నీకు ఏది చెప్పను, ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య నేను దేవుడిని కాదు కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు” అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ విశేషంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డ్ ను సొంతం చేసుకుంది ఈ టీజర్. 24 గంటలు కూడా కాకముందే ఈ టీజర్ 36 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఫాస్టెస్ట్ వ్యూస్ దక్కించుకున్న టీజర్ గా నిలిచింది రాధేశ్యామ్.

ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ డార్లింగ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణ గా నిలిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ గా పుజా హెగ్డే కనిపించనున్నారు. ఇప్పటి వరకు ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ ‘గ్లిమ్స్ ఆఫ్ రాధేశ్యామ్’ విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ విక్ర‌మాదిత్య టీజ‌ర్ తో “రాధే శ్యామ్” ఫ్లేవ‌ర్ టేస్ట్ చూపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో బెస్ట్ కపుల్‌‌‌‌గా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. వాళ్ళు ఎవరంటే..

Nivetha Thomas: వావ్.. అరుదైన ఫీట్ సాధించిన నేచురల్ బ్యూటీ నివేదా థామస్.. కష్టానికి సలామ్ కొట్టాల్సిందే..!

Maa Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానెల్‌తోపాటు నాగబాబు రాజీనామాను తిరస్కరించిన ఈసీ..