Most Eligible Bachelor: ‘మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీమ్ పై ప్రశంసలు కురిపించిన నాగార్జున..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన సినిమా మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్. ఈ సినిమాను అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో

Most Eligible Bachelor: 'మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' టీమ్ పై ప్రశంసలు కురిపించిన నాగార్జున..
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2021 | 8:57 AM

Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన సినిమా మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్. ఈ సినిమాను అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ” భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా కలసి జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో నిర్మించారు . ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల‌య్యి పండ‌గ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రానికి గొపిసుంద‌ర్ అందించిన ఆడియో సూప‌ర్బ్ స‌క్స‌స్ అవ్వ‌టం తో ఈ సినిమా ఆడియ‌న్స్ ని విప‌రీతం గా ఆక‌ట్టుకుని దియెట‌ర్స్ కి ప్రేక్ష‌కుల్ని ర‌ప్పిస్తుంది.

ఇప్ప‌టికే 40 కొట్ల కి పైగా గ్రాస్ వ‌సూలు చేసి అఖిల్ అక్కినేని కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిల‌వ‌టం విశేషం. అయితే ఈ చిత్ర ఘ‌న‌విజ‌యం సంద‌ర్బంగా కింగ్ అక్కినేని నాగార్జున గారు మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ టీంని అభినందిస్తూ.. ఆయ‌నే హోస్ట్ గా సెల‌బ్రెట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ తో పాటు ద‌ర్శ‌కులు సుకుమార్‌, వంశి పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్‌, మారుతి, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, సుబ్బు, వెంకి అట్లూరి,డాలి, ప్ర‌తాప్‌,కౌషిక్ హ‌జ‌ర‌య్యారు. ఈ సినిమా ఇంకా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని అంద‌రూ వారి బ్లెస్సింగ్స్ అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న డార్లింగ్.. నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..

Ananya Panday : ఇదేం సినిమా షూటింగ్ కాదు ఆలస్యంగా రావడానికి.. అనన్య పై సీరియస్ అయిన ఎన్సీబీ అధికారులు..

Bigg Boss 5 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా.. ఇది నిజంగా ఊహించని షాక్..