Sovereign Gold Bond scheme: అక్టోబర్‌ 25 నుంచి సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌.. తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు

Sovereign Gold Bond scheme: ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకునేవారికి ఎన్నో మార్గాలున్నాయి. బ్యాంకుల్లో, ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసే స్కీమ్స్‌ అందుబాటులో..

Sovereign Gold Bond scheme: అక్టోబర్‌ 25 నుంచి సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌.. తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు
Sovereign Gold Bond Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Oct 24, 2021 | 8:15 AM

Sovereign Gold Bond scheme: ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకునేవారికి ఎన్నో మార్గాలున్నాయి. బ్యాంకుల్లో, ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసే స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం మరోసారి గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను ప్రారంభించనుంది. అక్టోబర్‌ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఇష్యూ అందుబాటులో ఉంటుంది. నవంబర్‌ 2న బాండ్‌ జారీ అవుతుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకుు మినహాయించి ఇతర బ్యాంకుల్లో ఈ గోల్డ్ బాండ్లు అందుబాటులో ఉంటాయి. మీరు మీకు దగ్గరిలోని ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లి కూడా గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. పలు పోస్టాఫీసుల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తరుపున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బంగారు బాండ్లను విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. ఈ గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల తర్వాత బాండ్ల నుంచి నిష్క్రమించుకోవచ్చు. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించి ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 2015వ తేదీన కేంద్రం ప్రారంభించింది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. పసిడి బాండ్స్‌పై పెట్టుబడిదారులకు ఏడాదికి 2.5 శాతం వడ్డీ రెండు దఫాలుగా చెల్లించబడుతుంది. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు.

వడ్డీకి పన్ను రాయితీ:

ఇందులో పన్ను వర్తింపు, సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను రాయితీ ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. అన్వెస్ట్‌మెంట్‌దారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం.

అయితే బాండ్ కాలపరిమితి బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్‌ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. గోల్డ్ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక గ్రాము దగ్గరి నుంచి 4 కిలోల వరకు విలువైన గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి: Gold Price Today: పండగ సీజన్‌లో షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన రేట్లు.. 10 గ్రాముల ధర ఎంతంటే..!

Silver Price Today: పరుగులు పెడుతున్న వెండి.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా పెరిగింది..!

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..