Petrol-Diesel Price: అది తగ్గిస్తే రూ.77 కే పెట్రోల్, డీజిల్.. సంచలన విషయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్..

Petrol Diesel Price - Telangana: తెలంగాణ ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి..

Petrol-Diesel Price: అది తగ్గిస్తే రూ.77 కే పెట్రోల్, డీజిల్.. సంచలన విషయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 07, 2021 | 10:18 PM

Petrol Diesel Price – Telangana: తెలంగాణ ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వ్యాట్ పెంచలేదని, తామెందుకు తగ్గిస్తామని కుండబద్ధలు కొట్టారు. ఆదివారం నాడు ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఇంధన ధరలు సహా పలు కీలక అంశాలపై సంచలన కామెంట్స్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై తాము వ్యాట్ తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. ఒక్క రూపాయి కూడా తగ్గించబోమన్నారు. ‘మేం వ్యాట్ పెంచలేదు, అందుకే తగ్గించడం’. పెట్రోల్, డీజిల్‌ ధరలను అనవసరంగా పెంచి దేశ ప్రజల జేబు కొట్టేసింది కేంద్ర ప్రభుత్వం అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. అవనసరంగా, ఎడాపెడా రేట్లు పెంచింది కేంద్రమైతే.. తమను తగ్గించమంటే ఎందుకు తగ్గిస్తామని ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర పెరగలేదని, ఆ విషయంలో కేంద్ర పచ్చి అబద్ధాలు చెబుతోందని సీఎం కేసీఆర్ వివరించారు.

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ వేస్తే రాష్ట్రాలకు వాటా చెల్లించాల్సి వస్తుందన్న దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని, అందులో భాగంగానే సెస్‌ల పేరుతో రేట్లు విపరీతంగా పెంచారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం సెస్‌లను రద్దు చేస్తే రూ. 77 లకే పెట్రోల్, డీజిల్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇంధనం విషయంలో కేంద్రం జనాలను పచ్చి మోసం చేస్తోందని అన్నారు. సెస్‌ల పేరుతో రాష్ట్రాలకు దక్కాల్సిన డబ్బును ఎగ్గొడుతూ.. ప్రజల నుంచి యడాపెడా దోచుకుంటోందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ రద్దు చేయాలని తామే పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం అడ్డదారిలో, దొడ్డిదారిలో పెంచిందంటూ నిప్పులు చెరిగారు. అసలు చమురు ధరలు పెంచడమే తప్పు అని అన్నారు. పెట్రోల్ ధరల పెంపు వల్ల ప్రతి వస్తువు ధర పెరిగిందని, ఫలితంగా దేశంలో సామాన్య ప్రజలు బ్రతుకు భారమైందన్నారు.

దేశ సరిహద్దు కాపాడటంతో బీజేపీ వైఫ్యం.. బీజేపీ నేతలు ఎంతసేపు మతం, సరిహద్దుల పేరు చెబుతూ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. అయితే, బీజేపీ మాటలకే పరిమితమైందని, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఊర్లకు ఊర్లే కడుతోందన్నారు. దేశ సరిహద్దులను కాపాడటంతో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. బీజేపీ కారణంగా గంగానది‌లో శవాలు తెలాయని, ప్రభుత్వ తీరును తూర్పాడారు. రేపటి నుంచి దేశంలో అగ్గి పెడతామని, ఎక్కడ పెట్టాలో తమకు బాగా తెలుసునని అన్నారు.

కేఆరేంబి- జిఅరేంబి డ్రామా.. కృష్ణా రివర్ బోర్డు, గోదావరి బోర్డు లు పెద్ద డ్రామా అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి శకావత్ తనకు ఇచ్చిన మాట ప్రకారం ట్రిబ్యూనల్‌కు రిఫర్ ఎందుకు చేయరు? అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు వద్దా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని రకాల పోరాటాలు చేస్తామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ ఉన్నామన్నారు. ఆ కారణంగానే బీజేపీ ఎమ్మెల్యేలే వాళ్ళ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కష్టపడి తెలంగాణ తెచ్చానని, తెలంగాణను ఆగం చేస్తావుంటే తాను ఉరుకోబోనని తెగేసి చెప్పారు.

బండిపై భగ్గు… ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం వడ్డుల-బియ్యం తీసుకుంటా అంటే తాము వద్దంటున్నామా? అని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్‌తో చర్చకు రావాలంటూ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు ముఖ్యమంత్రి కేసీఆర్. ‘మా మెడలు వంచడం కాదు.. ఈ చర్చతో బండి సంజయ్ మెడలు నాలుగు ముక్కలు కావాలి’ అని అంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. ‘కొందరు నాయకులేమో అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీసు చట్టం అంటారు.. ఇదేనా వారికి చట్టంపై ఉన్న గౌరవం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు.

Also read:

T20 World Cup 2021, IND vs NAM: కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20.. హ్యాట్రిక్ విజయంతో ముగించేందుకు ఆరాటం..!

Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్.. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే..

వివాదంలో బాక్సర్ లోవ్లినా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికపై విమర్శలు.. అసలేమైందంటే?