AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: “మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం..” బండి సంజయ్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం.. కిషన్ రెడ్డికి వార్నింగ్

బండి సంజయ్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. సంజయ్‌కు నెత్తిలేదు, కత్తిలేదంటూ ఫైరయ్యారు.

CM KCR: మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం.. బండి సంజయ్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం.. కిషన్ రెడ్డికి వార్నింగ్
Kcr Vs Bandi Sanjay
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2021 | 8:20 PM

Share

బండి సంజయ్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. సంజయ్‌కు నెత్తిలేదు, కత్తిలేదంటూ ఫైరయ్యారు. తనని జైలుకి పంపుతా అని బండి సంజయ్ అంటున్నాడని.. అంత ధైర్యం ఉన్నవాళ్లు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. టచ్ చేస్తే తమ పవర్ ఏంటో తెలుస్తుందన్నారు. నాలుక ఉంది కదా అని మాట్లాడితే మెడలు విరుస్తామన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిదంటున్న బండి సంజయ్ దమ్ముంటే తన మీద కేసు పెట్టాలన్నారు.  అక్షరం ముక్కరాదు. హిందీ రాదు.ఇంగ్లీష్ ముక్క రాదు… కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే జీవోలు వీరికి అర్థం కావన్నారు. కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి రాష్ట్రానికి బండి సంజయ్ ఏం చేశాడని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చిన్నాపెద్దా ఏమీ లేదా? ముఖ్యమంత్రిని, మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడతారా? అనేక విషయాల్లో కేంద్రంలో మీ ప్రభుత్వం ఫెయిలవలేదా? అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. మేమిచ్చిన డబ్బుతోనే కేంద్రం నడుస్తోంది. గుర్తుంచుకోండి అంటూ స్టేట్ బీజేపీ లీడర్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఉండి.. అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్‌ ఎవరి మెడలు వంచుతారో చెప్పాలని నిలదీశారు. ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా? అనే స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు.  ఓవైపు.. మొత్తమే కొనమని రాతపూర్వకంగా కేంద్రం లేఖలు ఇస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకులు పండించాలని రైతులను అయోమయంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.

కిషన్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్

కిషన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.  కేంద్ర మంత్రి హోదాలో హుందాగా మాట్లాడాలని సూచించారు. ‘నేను కూడా కూడా కేంద్ర మంత్రిగా పని చేశా.. పెద్ద పదవి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. హుజురాబాద్‌లో కిషన్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

Also Read: “ఇక నుండి కేంద్రానికి చుక్కలే… నిద్ర పోనివ్వం”… నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్