AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: “ఇక నుండి కేంద్రానికి చుక్కలే… నిద్ర పోనివ్వం”… నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం తమదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని సీఎం చెప్పారు.

CM KCR:  ఇక నుండి కేంద్రానికి చుక్కలే... నిద్ర పోనివ్వం... నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
Cm Kcr
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2021 | 8:13 PM

Share

రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం తమదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగిందన్నారు. కరోనా కాలంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం నిలువ చేసే భారీ, శాస్త్రీయ గోదాములు రాష్ట్రంలో ఉండవని తెలిపారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వద్దని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారని.. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో వరి వద్దన్నారని వివరించారు. అనేక పెట్టుబడులు పెట్టి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని..  ప్రపంచంలోనే ఎక్కడాలేని రైతుబంధు తీసుకువచ్చామని కేసీఆర్ చెప్పారు. రైతుబీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. గతంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సరిగా దొరికేవి కావని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ ప్రకటించారు. కల్తీ విత్తనాలమ్మేవారిపై పీడీ యాక్టు తెచ్చిన సర్కారు తమదే అన్నారు సీఎం.

సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ కీ పాయింట్స్:

* ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోంది. * ధాన్యం కొనుగోలు చేయమని నిరాకరిస్తోంది. * ధాన్యం నిల్వ చేసే అవకాశం రాష్ట్రాలకు లేదు.  కేంద్రం కొనుగోలు చేయాలి. * నేను స్వయంగా ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోలుపై సంబంధిత మంత్రి సంప్రదించాను. * పంట మార్పిడి చేయాలని కేంద్ర మంత్రి చెప్పారు. * తెలంగాణలో యాసంగి వరి పంట అంటే బాయిల్డ్‌ రైసే * వానకాలంలోనే రా రైసు వస్తుంది. * తెలంగాణ ప్రభుత్వంతో ఎఫ్‌సిఐ కుదుర్చుకున్న ఎంఓయూలను కేంద్రం పట్టించుకోవడంలేదు * భవిష్యత్తులో బాయిల్డ్‌ రైసు ఇవ్వమని చెబితేనే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. * విదిలేక అంగీకరించాం. * ఈ ఏడాది ఎంత తీసుకుంటామో కేంద్రం ఇప్పటి వరకు చెప్పలేదు * వర్షాకాలంలో 62లక్షల ఎకరాలో వరి పంట సాగు చేశారు. * కోటి 70లక్షల టనున్న ధాన్యం వచ్చింది. * కోటి 10లక్షల టన్నుల రైసు తెలంగాణలో రెడీ గా ఉంది. ఇది తీసుకునే దిక్కేలేదు. * వరికంటే ఎక్కువ లాభం వచ్చే పంటలను వేయాలి. * బండి సంజయ్‌ పచ్చి అబద్దాలను చెబతున్నాడు. * సంజయ్‌ ఎవరి మెడలు వంచుతడు, ఆయన మెడలు వంచుతడా, కేంద్రం మెడలు వంచుతడ * కేంద్రం ఆర్డర్‌ ఇస్తదా ధాన్యం కొనుగోలు చేస్తుందని చెబుతారా?

రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రానికి కేసీఆర్ అల్టిమేటం ఇచ్చారు. ఉత్తర భారతదేశంలో ఉన్న రైతులకు మద్దతుగా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. ఇక నుండి కేంద్రానికి చుక్కలే… నిద్ర పోనివ్వమన్నారు కేసీఆర్. రైతులను గందరగోళానికి గురి చేస్తే బండి సంజయ్ ఆట కట్టిస్తామని చెప్పారు. సిల్లి బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దని పేర్కొన్నారు.

బండి సంజయ్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. సంజయ్‌కు నెత్తిలేదు, కత్తిలేదంటూ ఫైరయ్యారు. తనని జైలుకి పంపుతా అని బండి సంజయ్ అంటున్నాడని.. అంత ధైర్యం ఉన్నవాళ్లు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. టచ్ చేస్తే తమ పవర్ ఏంటో తెలుస్తుందన్నారు. నాలుక ఉంది కదా అని మాట్లాడితే మెడలు విరుస్తామన్నారు.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?