AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: కొనసాగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ..

ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు హాజరయ్యారు...

BJP: కొనసాగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ..
Bjp
Srinivas Chekkilla
|

Updated on: Nov 07, 2021 | 3:45 PM

Share

ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు హాజరయ్యారు. ప్రధానికి ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కూడా దేశ రాజధానిలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌కు ఒక రోజు ముందుగానే వచ్చారు. ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి ఇతర సీనియర్ పార్టీ నాయకులు ఈ సమావేశంలో వర్చువల్‎గా పాల్గొన్నారు.

మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నందుకు గానూ బీజేపీ కార్యకర్తలందరి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందిస్తూ సీనియర్‌ నేతలు సత్కరించారు.

భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో కరోనా పరిస్థితులు ప్రధాన అజెండాగా ఉండనున్నట్లు పార్టీ జనరల్‌ సెక్రటరీ అరుణ్ సింగ్‌ వెల్లడించారు. 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు నేరుగా సమావేశానికి హాజరయ్యారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా బీజేపీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ అధినేతలు మాత్రం వర్చుల్‌ పద్ధతిలో పాల్గొన్నారు. ఈ సమావశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగించనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ సంస్థను మరింత బలోపేతం చేయడానికి లక్ష్యాలను నిర్దేశించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి సమర్థవంతమైన నాయకత్వంలో 100 కోట్ల టీకాలు, 80 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించామని చెప్పారు.

Read Also.. PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎప్పుడంటే..