ఆల్కహాల్‌ ఎలా విషంగా మారుతుంది.. కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారు.. తాగేవాడు ఎందుకు చనిపోతున్నాడు..

Alcohol: కల్తీ మద్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కల్తీమద్యం విచ్చల విడిగా తయారుచేస్తున్నారు. దీని బారిని పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున

ఆల్కహాల్‌ ఎలా విషంగా మారుతుంది.. కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారు.. తాగేవాడు ఎందుకు చనిపోతున్నాడు..
Alcohol
Follow us
uppula Raju

|

Updated on: Nov 07, 2021 | 4:19 PM

Alcohol: కల్తీ మద్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కల్తీమద్యం విచ్చల విడిగా తయారుచేస్తున్నారు. దీని బారిని పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా బిహార్‌లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మద్య నిషేధం ఉంది కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్క బిహార్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దందా జోరుగా సాగుతుంది. అయితే కల్తీ మద్యం ఎలా తయారుచేస్తారు. ఇది విషంగా ఎలా మారుతుంది. దీనిని తాగినవ్యక్తి ఎందుకు చనిపోతున్నాడో తెలుసుకుందాం.

కల్తీ మద్యం ఎలా తయారచేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనినే దేశీ మద్యం కూడా అంటారు. చెరకు లేదా ఖర్జూరం, చక్కెర, సాల్ట్‌పెట్రే, బార్లీ, మొక్కజొన్న, కుళ్ళిన ద్రాక్ష, బంగాళాదుంపలు, బియ్యం, చెడిపోయిన నారింజ మొదలైన వాటిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు. వీటన్నిటిని కలిపి ఈస్ట్ ద్వారా పులియబెడుతారు. తర్వాత దీనికి ఆక్సిటాక్సిన్, నౌసాదర్, బెస్రాంబెల్ ఆకులు, యూరియా కూడా కలుపుతారు.

ఇవన్నీ నపుంసకత్వానికి దారి తీస్తాయి. అంతేకాదు నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. వీటిని మట్టిలో పాతిపెట్టిన తర్వాత బట్టీ సాయంతో ఆవిరి నుంచి మద్యం తయారు చేస్తారు. దీనిని మరింత మత్తుగా మార్చేందుకు మిథనాల్ కూడా కలుపుతారు. అయితే ఇలా తయారుచేసిన మద్యం మరింత మత్తుగా మార్చేందుకు నిర్వాహకులు రకరకాల రసాయనాలను కలుపుతున్నారు. ఈ క్రమంలో అది విషంగా మారుతుంది.

యూరియా, ఆక్సిటాక్సిన్, బెస్రాంబెల్ ఆకులు మొదలైన వాటిని కలిపి పులియబెట్టడం వల్ల అది ఆల్కహాల్ (ఇథైల్ ఆల్కహాల్)కు బదులుగా మిథైల్ ఆల్కహాల్‌గా మారుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ విషపూరితం కావడానికి ఈ మిథైల్ ఆల్కహాలే కారణం. ప్రతి ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి దాని ఆల్కైల్ సమూహంలోని ఆల్డిహైడ్‌గా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ అనే విషంగా మారుతుంది. ఇది నేరుగా తాగేవారి మెదడుపై ప్రభావం చూపుతుంది.

మద్యపానం మరణానికి ఎలా కారణమవుతుంది? ఇలా తయారు చేసిన ఆల్కహాల్ మానవ శరీరానికి ప్రాణాంతకంగా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రసాయన ప్రతిచర్య వేగవంతం అవుతుంది. దీని వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు పనిచేయడం మానేస్తాయి. కొందరిలో ఈ ప్రక్రియ నిదానంగా ఉంటే మరికొందరిలో వేగంగా ఉంటుంది. దీని కారణంగా చాలా సందర్భాలలో అకాల మరణం సంభవిస్తుంది.

స్నేహితులకు, బంధువులకు వింత షరతు విధించిన వధువు..! ఏంటో తెలిస్తే షాక్‌ అవుతారు..

WhatsApp: ఫోన్‎లో నెట్ లేకున్నా వెబ్ వాట్సాప్ పని చేస్తుంది.. అది ఎలాగంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే