Ashish Nehra: ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‎గా ఉండరాదని రూల్ బుక్‌లో ఎక్కడా రాయలేదు.. ఆశిశ్ నెహ్రా..

విరాట్ కోహ్లీ తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్‎ స్థానాన్ని పేసర్ జస్ప్రీత్ బుమ్రా భర్తీ చేయగలడని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. అతను అన్ని ఫార్మాట్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నందున కెప్టెన్‎గా ఎంపిక చెయ్యొచ్చని చెప్పాడు...

Ashish Nehra: ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‎గా ఉండరాదని రూల్ బుక్‌లో ఎక్కడా రాయలేదు.. ఆశిశ్ నెహ్రా..
Nehra
Follow us

|

Updated on: Nov 07, 2021 | 5:01 PM

విరాట్ కోహ్లీ తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్‎ స్థానాన్ని పేసర్ జస్ప్రీత్ బుమ్రా భర్తీ చేయగలడని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. అతను అన్ని ఫార్మాట్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నందున కెప్టెన్‎గా ఎంపిక చెయ్యొచ్చని చెప్పాడు. యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ గత నెలలోనే తెలిపాడు. దీంతో టీ20 జట్టు కెప్టెన్ ఎవరు అనేది చర్చ కొనసాగుతోంది. టీ20కి కెప్టెన్సీ రేస్‎లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ముందున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు టీ20 కెప్టెన్ భాద్యతలు స్వీకరించే అర్హతలు ఉన్నట్లు నెహ్రా తెలిపాడు.

“రోహిత్ శర్మ తర్వాత రిషబ్ పంత్, KL రాహుల్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. రిషబ్ పంత్ ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు. అయితే ఇంతకు ముందు జట్టు నుంచి కూడా తప్పించబడ్డాడు” అని ఆశిష్ నెహ్రా అన్నాడు. “మయాంక్ అగర్వాల్ గాయపడినందున KL రాహుల్ టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు… కాబట్టి జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక ఎంపిక కావచ్చు. అజయ్ జడేజా చెప్పినట్లుగా అతను ధృడంగా ఉన్నాడు. బుమ్రా అన్ని ఫార్మాట్‌లలో ఎల్లప్పుడూ XIలో ఉంటాడు. ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్లుగా ఉండరాదని రూల్ బుక్‌లో ఎక్కడా రాయలేదు” అని నెహ్రా పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ నవంబర్ 17న ప్రారంభమవుతుంది. జైపూర్‎లో మొదటి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 19న రెండో టీ20కి రాంచీ అతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 21న కోల్‌కతాలో మూడో మ్యాచ్‌ జరగనుంది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది.

Read Also.. T20 World Cup: వచ్చే టీ20 ప్రపంచ కప్‎లో ఆ జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్‎లు ఆడాల్సిందే.. ఎందుకంటే..

Latest Articles
ఈ వయ్యారి అందాల విందుకు ఆ సముద్రం కూడా ఇంకుతుందేమో..
ఈ వయ్యారి అందాల విందుకు ఆ సముద్రం కూడా ఇంకుతుందేమో..
మైక్రోఓవెన్‌ వాడుతున్నారా..? ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం..!
మైక్రోఓవెన్‌ వాడుతున్నారా..? ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం..!
ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
గుట్ట లాంటి పొట్టకు బ్రహ్మాస్త్రం.. ఈ నీటిని ఖాళీకడుపుతో తాగారంటే
గుట్ట లాంటి పొట్టకు బ్రహ్మాస్త్రం.. ఈ నీటిని ఖాళీకడుపుతో తాగారంటే
బెంగాల్ గవర్నర్‎పై సీఎం మమత కీలక ఆరోపణలు.. ఒరిజినల్ వీడియో ఉందంటూ
బెంగాల్ గవర్నర్‎పై సీఎం మమత కీలక ఆరోపణలు.. ఒరిజినల్ వీడియో ఉందంటూ
ఆ జిల్లాలో పోలింగ్ అంటే కత్తిమీదసామే.. భారీ ఎత్తున అధికారుల నిఘా
ఆ జిల్లాలో పోలింగ్ అంటే కత్తిమీదసామే.. భారీ ఎత్తున అధికారుల నిఘా
ఆరోగ్యానికి శ్రీరామ రక్ష త్రిఫల చూర్ణం.. పరగడుపున తీసుకుంటే..
ఆరోగ్యానికి శ్రీరామ రక్ష త్రిఫల చూర్ణం.. పరగడుపున తీసుకుంటే..
ముళ్లపొదల్లో మైండ్ బ్లోయింగ్ దృశ్యం.. ఆ మహిళదే కీలక పాత్ర..
ముళ్లపొదల్లో మైండ్ బ్లోయింగ్ దృశ్యం.. ఆ మహిళదే కీలక పాత్ర..
అబ్బ.. ఎంత మంచి వార్తో.. ఆ ప్రాంతాల్లో రెండు రోజులు వర్షాలు..
అబ్బ.. ఎంత మంచి వార్తో.. ఆ ప్రాంతాల్లో రెండు రోజులు వర్షాలు..
ఈసీ ఆఫీసుకు బ్యాలెట్ బాక్సులు.. పెద్ద ఎత్తున పోస్టల్ ఓటింగ్..
ఈసీ ఆఫీసుకు బ్యాలెట్ బాక్సులు.. పెద్ద ఎత్తున పోస్టల్ ఓటింగ్..