Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zika Dengue Swine Flu: పెరుగుతున్న వైరస్‌ల ముప్పు.. డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ, జికా మధ్య లక్షణాల్లో తేడాలివే..

Zika Dengue Swine Flu: డెంగ్యూ, స్వైన్ ఫ్లూ తో పాటు.. దేశంలో జికా వైరస్ ప్రమాదం కూడా పెరుగుతోంది. కేరళ, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక ప్రాంతాల్లో జికా కేసులు నమోదయ్యాయి.

Zika Dengue Swine Flu: పెరుగుతున్న వైరస్‌ల ముప్పు.. డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ, జికా మధ్య లక్షణాల్లో తేడాలివే..
Zika
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 07, 2021 | 7:55 PM

Zika Dengue Swine Flu: డెంగ్యూ, స్వైన్ ఫ్లూ తో పాటు.. దేశంలో జికా వైరస్ ప్రమాదం కూడా పెరుగుతోంది. కేరళ, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక ప్రాంతాల్లో జికా కేసులు నమోదయ్యాయి. ఈ మూడు వ్యాధులు కలిసి వ్యాప్తి చేందాయో ప్రాణాలకే ప్రమాదం అని వైద్యాధికారులు చెబుతున్నారు. అందుకే స్వైన్ ఫ్లూ, జికా వైరస్, డెంగ్యూ లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. వైద్యుల ప్రకారం, ఈ మూడు వ్యాధుల లక్షణాల మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుంది. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం దేశంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది రోగులు తీవ్ర అవస్థలు పడి ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకే డెంగ్యూ వ్యాధిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్యుల ప్రకారం.. ఈ వ్యాధి దోమ కాటు వల్ల వస్తుంది. పగటి పూట సంచరించే దోమ కాటు ద్వారా డెండ్యూ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ మురుగు నీటిలో వృద్ధి చెందుతుంది. అందుకే ప్రజలు తమ పరిసరాల చుట్టూ మురుగు నీరు లేకుండా, నీరు నిల్వ లేకుండా ఉండేలా చూసుకోండి. ఎల్లప్పుడూ ఫుల్ స్లీవ్ దుస్తులనే ధరించాలి. రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నీరసం, తలనొప్పి, కళ్లు నొప్పిగా అనిపించడం, అలసట, వాంతులు, విరేచనాలు ఉంటే డెంగ్యూ లక్షణాలు. అందుకే వెంటనే వైద్యుడిని సంప్రదించి కాటు వేసేవాడు. ఈ దోమ స్వచ్ఛమైన నీటిలో వృద్ధి చెందుతుంది. అందుకే ప్రజలు తమ చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎప్పుడూ ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి. రెండు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనితో పాటు, బలహీనంగా అనిపించడం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, అలసట, వాంతులు మరియు విరేచనాలు కూడా డెంగ్యూ లక్షణాలే. అందుకని ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

స్వైన్ ఫ్లూ.. ఇది ఒక అంటు వ్యాధి. ఇది H 1N 1 వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో స్వైన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కేసులు డెంగ్యూ కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దీనిపట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వైద్యుల ప్రకారం.. స్వైన్ ఫ్లూ లక్షణాలు వచ్చినప్పుడు, రోగి పదేపదే దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి, అధిక జ్వరంతో బాధపడుతారు. కొన్నిసార్లు చలి జ్వరం కూడా వస్తుంది. తీవ్ర అలసటగా ఉంటుంది. స్వైన్ ఫ్లూ నివారించడానికి, దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు మీ నోటికి చేయి గానీ, క్లాత్ గానీ అడ్డు పెట్టుకోండి. అలాగే తినడానికి ముందు చేతులను శుభ్రం చేసుకోండి. మాస్క్ ధరిరంచాలి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

జికా వైరస్.. జికా వైరస్ ఈడెస్ ఈజిప్టి, ఈడెస్ ఆల్బోపిక్టస్ అనే దోమల కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. చాలా మందిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడవు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో జికా వైరస్ సోకితే బిడ్డలో అనేక రుగ్మతలు వస్తాయి. అందుకే ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధిక జ్వరం, కళ్ళలో మంటగా ఉండటం, బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పు, తీవ్రమైన అసల జికా వ్యాధి లక్షణాలు.

జికా వైరస్ నుండి రక్షించడానికి మార్గాలు.. దోమతెర ఉపయోగించండి. ఇంట్లో నీల్వ నీరు ఉండకుండా చూడండి. ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. వరుసగా రెండు రోజులకు మించి జ్వరంగా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.

Also read:

Yoga Poses : ఈ 3 యోగాసనాలను క్రమం తప్పకుండా సాధన చేయండి.. రక్తప్రసరణను మెరుగుపరచుకోండి..

ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం మానేసి సాగు బాట పట్టింది.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుంది..

CM KCR: రాత్రి 7 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రెస్‌మీట్.. ఈ అంశాలపై..