ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం మానేసి సాగు బాట పట్టింది.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుంది..

Nabanita Das: వ్యవసాయ రంగంలో చాలా అవకాశాలున్నాయి. కష్టపడి, పట్టుదలతో పనిచేస్తే విజయం తథ్యం. ఇదే విషయాన్ని నిరూపించింది అసోంకు చెందిన నబనితా దాస్.

ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం మానేసి సాగు బాట పట్టింది.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుంది..
Organic Farming
Follow us

|

Updated on: Nov 07, 2021 | 5:58 PM

Nabanita Das: వ్యవసాయ రంగంలో చాలా అవకాశాలున్నాయి. కష్టపడి, పట్టుదలతో పనిచేస్తే విజయం తథ్యం. ఇదే విషయాన్ని నిరూపించింది అసోంకు చెందిన నబనితా దాస్. ఆమె తన ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయడానికి ప్రయత్నించింది. ఈ రోజు ఆమె సేంద్రియ వ్యవసాయానికి యజమానిగా మారింది. వ్యవసాయం ఆమెకు గౌరవాన్ని, ప్రతిష్టను ఇవ్వడమే కాకుండా సంపాదన కూడా తెచ్చిపెట్టింది. నబానితా దాస్ 2010 వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ నర్సుగా పనిచేశారు.

అయినప్పటికీ ఆమె నిత్యం వ్యవసాయం గురించే ఆలోచించేది. ఉద్యోగం మానేసిన తర్వాత 2014లో వ్యవసాయంలో ఫార్మల్‌ శిక్షణ తీసుకుని క్రమంగా విజయం సాధించింది. వ్యవసాయంతో పాటు చేపల పెంపకం, పశుపోషణలో కూడా ప్రయత్నించి విజయం సాధించింది. సంప్రదాయ వ్యవసాయంతో ప్రారంభించిన నబానితా దాస్ నేడు అన్ని రకాల కూరగాయలు, పండ్లను పండిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేయడం ప్రారంభించింది. వారి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ, ధర కూడా బాగానే ఉంది. ఆరోగ్యంపై అవగాహన పెరగడం వల్ల ప్రజలు ఆర్గానిక్ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఉపయోగించడం ప్రారంభించారు.

ఎన్నో అవార్డులు అందుకున్నారు నేడు నబానిత పొలం చిన్న వ్యవసాయ కేంద్రంగా మారింది. సంప్రదాయ పంటల నుంచి వివిధ రకాల పూల వరకు కూడా ఇక్కడ పండిస్తారు. నాబానీత పొలంలో వరితో పాటు పండ్లు, కూరగాయలు, పప్పులు, నూనె గింజల పంటలు సాగు చేస్తున్నారు. అంతే కాకుండా వివిధ జాతుల కోళ్లు, పావురాలు, బాతులకు చెందిన దేశీ, విదేశీ జాతులను పెంచుతున్నారు. ప్రసిద్ధ కడక్‌నాథ్‌తో సహా నబానిత ఫారమ్‌లో అనేక రకాల కోళ్లు కూడా కనిపిస్తాయి.

డిడి కిసాన్ నివేదిక ప్రకారం.. నబానితా దాస్ వ్యవసాయ రంగంలో చేసిన విశేష కృషికి అనేక అవార్డులతో సత్కరించారు. నేటి కాలంలో రైతులందరికీ నాబానీత స్ఫూర్తిదాయకంగా మారింది. ఆమెకు గౌరవం రావడమే కాకుండా వ్యవసాయం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది. నేడు, యువ రైతులు వారి సేంద్రియ వ్యవసాయాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సమాచారం తెలుసుకున్న తర్వాత నబానిత మాదిరి సాగు చేయాలని తిరిగి వెళుతున్నారు.

Viral Video: నాగుపాము, కొండచిలువ మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారో చూడండి..

Breakfast: ప్రొటీన్స్‌ అధికంగా ఉండే టిఫిన్స్‌ ఇవే..! బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఎంతో మంచిది..

Smart Phones: ఈ 5 స్మార్ట్‌ఫోన్‌లు రూ.15000 కంటే తక్కువే.. 6GB RAM, బలమైన బ్యాటరీ, పెద్ద డిస్‌ ప్లే..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..