EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాలో బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేసుకోండిలా..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటే ఖాతాదారులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)ను తప్పకుండా కలిగి ఉండాలి...

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాలో బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేసుకోండిలా..
Pf
Follow us

|

Updated on: Nov 07, 2021 | 6:14 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటే ఖాతాదారులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)ను తప్పకుండా కలిగి ఉండాలి. UAN నెంబర్‎తో లాగిన్ అయి బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే మన లావాదేవీలను కూడా చూడొచ్చు. ఇది చేసే ముందు మొదటగా యూఎన్ఏ నెంబర్‎ను ఆక్టివేట్ చేసుకోవాలి. ఈపీఎఫ్ఓ అధికార వెబ్‎సైట్‎లోకి వెళ్లి ఆక్టివ్ యూఎన్ఏపై క్లిక్ చేయాలి. అందులో మన యూఎన్ఏ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. తర్వాత గేట్ అథంటికేషన్‎పై క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మన ఫోన్ నెంబర్‎కు లాగిన్ పాస్‎వర్డ్ వస్తుంది. ఆ వివరాలతో లాగిన్ అయి పాస్‎వర్డ్ మార్చుకోవాలి. 6 గంటల తర్వాత మీ UAN నెంబర్ ఆక్టివేట్ అవుతుంది.

ఆ తర్వాత ఈపీఎఫ్ఓ అధికార వెబ్‎సైట్‎లోకి వెళ్లాలి.UAN నెంబర్‎తో లాగిన్ అయి మెనులో ‘మేనేజ్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ మెను నుండి ‘KYC’ ఎంపికకు వెళ్లి, డాక్యుమెంట్‎లో ‘బ్యాంక్’ను ఎంచుకోవాలి. బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్‌తో సహా కొత్త బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత ‘సేవ్’పై క్లిక్ చేయాలి. అవసరమైన పత్రాలు అప్‎లోడ్ చేయాలి. మీది స్టేట్ బ్యాంకు అయితే వివరాలు సరిచూస్తుంది. KYC ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీ సేవ అభ్యర్థన స్థితి డిజిటల్‌గా ఆమోదించబడిన KYCకి నవీకరించబడుతుంది. వివరాలను బ్యాంకు ధృవీకరించిన తర్వాత EPFO ​నిర్ధారణ సందేశాన్ని పంపుతుంది.

Read Also..Elon Musk: 10 శాతం వాటా విక్రయించాలా వద్దా.. ట్విట్టర్ పాలోవర్స్‎కి ఎలాన్ మస్కు ప్రశ్న..

WhatsApp: ఫోన్‎లో నెట్ లేకున్నా వెబ్ వాట్సాప్ పని చేస్తుంది.. అది ఎలాగంటే..