AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI PET Admit Card 2021: SBI ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

SBI PET Admit Card 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోసం (SBI PET) అడ్మిట్ కార్డ్‌ని విడుదల చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పరీక్షకు దరఖాస్తు

SBI PET Admit Card 2021: SBI ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Sbi Pet
uppula Raju
|

Updated on: Nov 07, 2021 | 6:21 PM

Share

SBI PET Admit Card 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోసం (SBI PET) అడ్మిట్ కార్డ్‌ని విడుదల చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుంచి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. SBI PO PET అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం. SBI PET అడ్మిట్ కార్డ్ 2021 హార్డ్ కాపీని బ్యాంక్ అభ్యర్థులకు పంపదు. అభ్యర్థులే స్వయంగా అడ్మిట్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు కింద ఇచ్చిన స్టెప్స్‌ ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ చేయడం ఎలా అభ్యర్థులు ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న “ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ మెటీరియల్స్” విభాగానికి వెళ్లాలి.లాగిన్ చేయడానికి రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకొని హార్డ్ కాపీ తీసుకుంటే మంచిది.

అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే మీరు SBIని సంప్రదించి సరిదిద్దుకోవచ్చు. దీంతో పాటు SC/ST/రిలిజియస్ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది.

అయితే పరీక్ష తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే నవంబర్ లేదా డిసెంబర్‌లో పరీక్ష నిర్వహిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరీక్ష తేదీకి ముందే అడ్మిట్ కార్డ్ జారీ చేయడం విశేషం. ఈ పరీక్ష లేదా అడ్మిట్ కార్డ్‌కు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థి అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్, SBI PET కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు హాజరుకావలసి ఉంటుంది.

ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం మానేసి సాగు బాట పట్టింది.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుంది..

Wife and Husband: మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదనే అనుమానం కలుగుతుందా? అయితే ఇవి తెలుసుకోండి..!

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాలో బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేసుకోండిలా..