Winter Skin Care: అసలే చలికాలం.. చర్మ సంరక్షణకు ఈ 6 మార్పులు తప్పనిసరి.. అవేంటంటే..

Winter Health Tips: చలికాలంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సీజన్‌లో పొడి వాతావరణం, కాలుష్యం వల్ల చర్మం పగిలిపోవడం, పొడివారడం

Winter Skin Care: అసలే చలికాలం.. చర్మ సంరక్షణకు ఈ 6 మార్పులు తప్పనిసరి.. అవేంటంటే..
Winter
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 07, 2021 | 11:04 PM

Winter Health Tips: చలికాలంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సీజన్‌లో పొడి వాతావరణం, కాలుష్యం వల్ల చర్మం పగిలిపోవడం, పొడివారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి తరుణంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇంకా చెప్పుకోవాలంటే ప్రతీ సీజన్‌కి ఒకరకమైన చర్మ సమస్యల ఉత్పన్నమవుతుంటాయి. అందేకే సీజన్‌కు తగ్గట్లుగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ధరించే దుస్తులు మొదలు, తినే ఆహారం, జీవనశైలి.. ప్రతి అంశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాతావరణ మార్పులకు తగ్గట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అయితే, మిగతా సీజన్ల కంటే కూడా చలికాలం చాలా ప్రమాదకరం అని చెప్పాలి. ఈ సీజన్‌లో అనేక చర్మ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. చర్మ సంరక్షణకు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి శీతాకాలంలో చర్మ సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం వెచ్చగా ఉండేందుకు అనువైన దుస్తులు మాత్రమే ధరించాలి. పొడి వాతావరణం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలోని తేమను లాగేస్తుంది. చర్మం అంతా పొడిగా మారి, తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే.. క్రీమ్‌లా ఉండే క్లేన్సర్‌ని ఎంచుకోవాలి. నురుగుతో కూడిన ఫేస్‌ వాష్‌లు అస్సలు వాడకూడదు. ఎందుకంటే.. అవి ముఖంపై ఉండే మురికితో పాటు తేమను కూడా క్లీన్ చేస్తుంది. అలా చేయడం ద్వారా చర్మం డీహైడ్రేట్ అవుతుంది. సరైన పీహెచ్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి, చర్మాన్ని మరింత మృదువుగా చేసే క్రీమ్ ఆధారిత క్లేన్సర్స్‌ని ఎంచుకోవాలి.

ఎక్స్ఫోలియేటర్.. సీజన్‌తో సంబంధం లేకుండా ఎక్స్‌ఫోలియేషన్ చాలా ముఖ్యం. చర్మం కింద పేరుకుపోయిన మృతకణాలను తొలగించే సున్నితమైన స్క్రబ్ అవసరం. కానీ అతి స్క్రబ్ చేస్తే ఇబ్బందులు తలెత్తక మానదు. అందుకే వారానికి ఒకసారి ఎక్స్‌ఫోలియేట్ చేయడం మంచిది.

సీరం ఆయిల్.. రోజూ వినియోగించే ఆయిల్‌కు బదులుగా.. సీరమ్ ఆయిల్‌ను అప్లై చేస్తే మంచి జరుగుతుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా మార్చేందుకు సహకరిస్తుంది.

మాయిశ్చరైజర్.. చర్మాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. అందుకే సాధారణ క్రీమ్స్‌కు బదులుగా హెవీ క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి. వేసవిలో తేలికపాటి మాయిశ్చరైజర్ అనువుగా ఉంటుంది. కానీ, శీతాకాలంలో హెవీ క్రీమ్ తేమన్ చర్మంతోనే అట్టిపెట్టడంలోనే సహాయపడుతుంది.

నైట్ ఫేస్ ప్యాక్.. నైట్ ఫేస్ ప్యాక్‌లు చర్మంలోని తేమను లాక్ చేయడానికి సహాయపడుతాయి. ఇది చర్మం హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

లిప్‌బామ్ అప్లై చేయండి.. చలికాలంలో ముఖ్యంగా పెదవులు పొడిబారడంతో పాటు, పగుళ్లు కూడా ఏర్పడుతాయి. ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి రాత్రిపూట లిప్‌బామ్ అప్లై చేసుకోవడం ఉత్తమం.

Also read:

కోచ్ ద్రవిడ్, కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్న టీమిండియా.. 8 ఏళ్ల తరువాత అక్కడ అంతర్జాతీయ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితోనో తెలుసా?

Viral Video: రెండు నక్కలకు చెడుగుడు ఆడుకున్న పిల్లి.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్ చెప్పక మానరు..!

Chanakya Niti : మీరు పిల్లలను ఉన్నతులు కావాలా?.. అయితే ఈ 3 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..