Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arthritis: కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ చిట్కాలు పాటిస్తే నొప్పులు మటుమాయం

వైద్య నిపుణులు సూచించే ఆ చిట్కా ఏంటో తెలుసా? బరువు తగ్గడం. నిజమే బరువు తగ్గితే కీళ్ల నొప్పుల సమస్యలు దాదాపు 50 శాతం మేరక తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు శరీర బరువులో 10 శాతం తగ్గినా గణనీయమైన ఫలితాలను పొందవచ్చని పేర్కొంటున్నారు.

Arthritis: కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ చిట్కాలు పాటిస్తే నొప్పులు మటుమాయం
Knee Pain
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 6:31 PM

ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా కొంత వయస్సు వచ్చాక అందరినీ కీళ్ల సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు అందరినీ బాధిస్తున్నాయి. వివిధ రకాల మందులను వాడుతున్నప్పటికీ కీళ్ల నొప్పులు అదుపులోకి రావడం లేదని కొందరు బాధపడుతుంటారు. అలాంటి వారు మందులతో పాటు ఓ చిట్కా పాటిస్తే దాదాపు 50 శాతం మేర నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. వైద్య నిపుణులు సూచించే ఆ చిట్కా ఏంటో తెలుసా? బరువు తగ్గడం. నిజమే బరువు తగ్గితే కీళ్ల నొప్పుల సమస్యలు దాదాపు 50 శాతం మేరక తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు శరీర బరువులో 10 శాతం తగ్గినా గణనీయమైన ఫలితాలను పొందవచ్చని పేర్కొంటున్నారు. బరువు తగ్గడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు శరీరంలో చెడు కొవ్వు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని చెబుతున్నారు. నడక, యోగా, చిన్నపాటి వ్యాయామాల ద్వారా బరువు తగ్గవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆర్థరైటిస్ సమస్య ఉన్న వారు గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన శరీర నిర్వహణ కచ్చితంగా బరువ సమస్యపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. 

సరైన ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహస్తే ఆర్థరైటిస్ లక్షణాల నుంచి బయటపడవచ్చు. అధిక బరువు కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది నొప్పి, వాపును మరింత పెంచుతుంది. బరువు తగ్గడం ద్వారా, మీరు మీ కీళ్లపై ఒత్తిడిని తగ్గించవచ్చు. దీంతో ఆర్థరైటిస్ లక్షణాల తీవ్రతను తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం, తక్కువ ఇంపాక్ట్ ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యకరమైన బరువును సాధించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది. జీవనశైలిలో కొద్దిపాటు మార్పులు చేస్తే కీళ్లనొప్పులను ఎదుర్కోవడానికి, అలాగే మీ జీవన నాణ్యత మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

ఆర్ధరైటిస్ సమస్య ఉన్న వారు బరువు తగ్గితే కలిగే ప్రయోజనాలు ఇవే

  • ఆర్ధరైటిస్ సమస్య ఉన్న వారు కేవలం 10 శాతం బరువు తగ్గితే కీళ్ల నొప్పులను 50 శాతం వరకూ తగ్గుతాయి. మీరు ఎంత బరువు తగ్గితే కీళ్ల పై ఒత్తిడి అంత తగ్గుతుంది. ఆస్టియో ఆర్ధరైటిస్ ఉన్న ఉన్న వారు ఆరోగ్యకరమైన ఆహారం, తేలికపాటి వ్యాయామాలతో బరువు తగ్గవచ్చు. వీళ్లు బరువు తగ్గితే మోకాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. 
  • బరువు తగ్గడం ద్వారా కీళ్లపై ఒత్తిడి తగ్గి, కీళ్ల పనితీరు మెరుగవుతుంది.
  • రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, లూపస్ మొదలైన అనేక స్వయం ప్రతిరక్షక రుగ్మతలను మరింత తీవ్రతరం చేస్తుంది. బరువు తగ్గడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. తద్వారా ఆర్థరైటిస్‌ను మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడుతుంది.
  • అధిక బరువు ఉన్నవారితో పోలిస్తే కనీసం 5 కిలోల బరువు తగ్గిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు మూడు రెట్లు మెరుగైన వ్యాధి నియంత్రణ ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
  • జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి ముందు బరువు తగ్గితే శస్త్రచికిత్సతో సంబంధం ఉన్న ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదనంగా, శస్త్రచికిత్స అనంతరం తిరిగి రికవరీ అవ్వడం సులభంగా ఉంటుంది. 
  • రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగులకు హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..