Health Tips: ఈ ఆహారాలకు చాలా మితంగా తీసుకోండి.. లేదంటే ఆ ముప్పు తప్పదు..

ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిజార్డర్.. కీళ్లు, ఇతర కణజాలాలపై ప్రభావం చూపుతాయి. భరించలేని నొప్పికి కారణం అవుతుంది. ఆర్థరైటిస్‌కు చికిత్స

Health Tips: ఈ ఆహారాలకు చాలా మితంగా తీసుకోండి.. లేదంటే ఆ ముప్పు తప్పదు..
Food
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 13, 2022 | 10:10 AM

ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిజార్డర్.. కీళ్లు, ఇతర కణజాలాలపై ప్రభావం చూపుతాయి. భరించలేని నొప్పికి కారణం అవుతుంది. ఆర్థరైటిస్‌కు చికిత్స లేనప్పటికీ.. ప్రారంభ రోగ నిర్ధారణ లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడే టిప్స్ చాలానే ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థరైటిస్ డే థీమ్ ‘ఇది మీ చేతుల్లోనే ఉంది, చర్య తీసుకోండి’. ఈ నినాదంతో ఆర్థరైటిస్ సమస్యపై పోరాటం మీ చేతుల్లోనే ఉందని, తక్షణమే ఆర్థరైటిస్ సమస్య నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకోవాలని నినదించింది డబ్ల్యూహెచ్ఓ. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు, వారి సంరక్షకులు, కుటుంబాలు, ఇతరులను వారి జీవనశైలిని మెరుగుపరచడానికి చర్య తీసుకునే విధంగా ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఆర్థరైటిస్ వ్యాధి నివారణకు మంచి పోషకాహారం తీసుకోవడంతో పాటు, శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. హానీకరమై ఆహారాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడొచ్చు.

కొన్ని ఆహారాలు, డ్రింక్స్ ఆర్థరైటిస్ సమస్యను, తీవ్రతను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీవన ప్రమాణాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. అదే సమయంలో మరికొన్ని ఆహారాలు ఆర్థరైటిస్ సమస్యను మరింత తీవ్రం చేస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. మరి హానీ తలపెట్టే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్థరైటిస్ బాధితులు తినకూడదని ఆహారాలు..

షుగర్..

ఆర్థరైటిస్‌తో బాధపడేవారు చక్కెరతో చేసిన పదార్థాలను తక్కువగా తినాలి. స్వీట్స్, ఐస్‌క్రీమ్, సోడా మొదలైన వాటికి దూరంగా ఉండాలి.

ఫ్రై చేసిన పదార్థాలు..

ఫ్రై చేసిన ఆహారాలు, వేయించిన మాంసం, చల్లబడిన ఆహార పదార్థాలు, కాల్చిన ఉత్పత్తులు, ప్యాక్ చేసిన ఆహారం, చిరుతిళ్లు ఆర్థరైటిస్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

ప్రాసెస్ చేసిన ఆహారం..

కొన్ని పరిశోధనల ప్రకారం రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఆర్థరైటిస్ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ప్రాసెస్ చేసిన పాలు, పాల ఉత్పత్తులలోని ప్రోటీన్ కీళ్ల చుట్టూ ఉన్న కణజాలానికి ఇబ్బంది కలిగిస్తుంది. రెడ్ మీట్‌లో ఉండే సంతృప్త కొవ్వులు వాపును మరింత పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

ఒమేగా-6..

ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే పదార్థాలు అతిగా తీసుకోవద్దు. మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, సోయా నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు..

సంతృప్త కొవ్వులు, అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్‌.. మయోన్నైస్, వనస్పతి, క్రీమ్ చీజ్, వెన్న, చీజ్‌లలో ఎక్కువగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది. వీటి వినియోగం పరిమితంగా ఉండాలి. లేదంటే ఆర్థరైటిస్ సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఆల్కహాల్..

ఆల్కహాల్ ఆర్థరైటిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ కారణంగా ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నవారు మద్యపానాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

గుడ్డు అధికంగా తినొద్దు..

సాధారణంగా గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనేది మనందరికీ తెలిసిందే. అయితే, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు గుడ్డును అధికంగా తినొద్దని సూచిస్తున్నారు నిపుణులు. గుడ్డు సొనలో అధిక స్థాయిలో అరాకిడోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కీళ్లలో మంట కలిగిస్తుంది. అందుకే కొడిగుడ్లను మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఉప్పు తగ్గించాలి..

ఆహారాలలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. చీజ్, క్యాన్డ్ సూప్, రొయ్యలు, పిజ్జా, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని పరిమితంగా తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..