Watermelon Benefits: పోషకాల నిధి పుచ్చకాయ.. రోజూ తింటే ఆ 7 సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

పుచ్చకాయల్లో 92 శాతం నీరే ఉంటుంది. ఇది అధిక కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాల వల్ల శరీరంలోని అనేక సమస్యలు దూరమవుతాయి.

Watermelon Benefits: పోషకాల నిధి పుచ్చకాయ.. రోజూ తింటే ఆ 7 సమస్యలకు చెక్ పెట్టవచ్చు..
Watermelon
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 04, 2022 | 1:57 PM

Watermelon Health Benefits: వేసవి కాలంతోపాటు అన్ని సీజన్లలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలామంచిది. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పుచ్చకాయతో పాటు, దాని విత్తనాలు కూడా చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఇది లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఎ, సి, ఇ, కె, నియాసిన్, జింక్, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఈ పోషకాల వల్ల శరీరంలోని అనేక సమస్యలు దూరమవుతాయి. పుచ్చకాయల్లో 92 శాతం నీరే ఉంటుంది. ఇది అధిక కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. కావున పుచ్చకాయతో పాటు దాని విత్తనాలను కూడా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

పుచ్చకాయ రోజంతా హైడ్రేట్‌గా ఉంచుతుంది: ఒక కప్పు పుచ్చకాయలో సుమారు 150 గ్రాముల (5 ఔన్సుల) నీరు ఉంటుంది. పుచ్చకాయ తినడం జీర్ణక్రియకు చాలా మంచిది. మీ చర్మ ఆరోగ్యాన్ని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచి ఆకలిని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గేలా చేస్తుంది: పుచ్చకాయ బరువు తగ్గించేందుకు మంచిగా సహాయపడుతుంది. మీ అల్పాహారంలో పుచ్చకాయను చేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇది రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే పుచ్చకాయ ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

మూత్రపిండాల సమస్యలు దూరం : పుచ్చకాయ పొటాషియం, కాల్షియం గొప్ప మూలం. ఇది మీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సెల్ డిఫరెన్సియేషన్ ప్రక్రియలో కాల్షియం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కణ నిర్మాణాన్ని నిర్వహించడంతోపాటు సెల్ ఫంక్షన్లను నియంత్రిస్తుంది.

కండరాల నొప్పులు: పుచ్చకాయలో ఎల్-సిట్రుల్లైన్ ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తగ్గిస్తుంది. శారీరక పనితీరును మెరుగుపరిచి కండరాలను బలంగా మారుస్తుంది. వ్యాయామానికి ముందు పుచ్చకాయ రసం తాగడం మంచిది.. ఎందుకంటే ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌కు కారణమవుతాయి. అలాగే, పుచ్చకాయలో ఉండే లైకోపీన్, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కణాలోబ ఇన్సులిన్-గ్రోత్ ఫ్యాక్టర్ (IGF) ని తగ్గించడం ద్వారా లైకోపీన్.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాస్తవానికి IGF అధిక సాంద్రత క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటుంది.

రక్తపోటు దూరం: పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరం ద్వారా అర్జినైన్‌గా మారుతుంది. ఈ అర్జినైన్ సిట్రులిన్‌తో పాటు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విడదీసి విశ్రాంతినిచ్చి రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే, పుచ్చకాయలో కెరోటినాయిడ్లు ఉంటాయి ఇవి సిరలు-ధమనులు గట్టిపడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గిస్తాయి.

చర్మ సౌందర్యానికి: పుచ్చకాయలో 95 శాతం నీరు మాత్రమే ఉంటుంది కావున.. ఇది చర్మానికి మంచి పోషణను అందించడంలో సహాయపడుతుంది. దీంతో మరింత కాంతివంతంగా మారుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..