AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Game: కొంపముంచిన పిల్లాడు.. అకౌంట్లలో రూ.36లక్షలు మాయం.. ఇంతకీ ఏం చేశాడంటే..

ఓ బాలుడు (16) తన తాత మొబైల్‌ తీసుకొని అందులో ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.

Online Game: కొంపముంచిన పిల్లాడు.. అకౌంట్లలో రూ.36లక్షలు మాయం.. ఇంతకీ ఏం చేశాడంటే..
DA
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2022 | 9:58 AM

Share

Hyderabad Police: ఆన్‌లైన్‌ గేమ్స్ వ్యసనం అక్షరాలా రూ.36 లక్షలు పొగొట్టేలా చేసింది. ఓ బాలుడు ఆన్‌లైన్‌లో గేమ్ ఆడి ఏకంగా రూ.36 లక్షలు పొగట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట్‌కు చెందిన ఓ బాలుడు (16) తన తాత మొబైల్‌ తీసుకొని అందులో ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత తాత ఫోన్‌లో ఉన్న తన తల్లి అకౌంట్‌ నుంచి మొదటగా రూ.1,500 పెట్టి ఆట ఆడటం మొదలుపెట్టాడు.

ఆ తర్వాత రూ .10 వేల చొప్పున డబ్బులు పెట్టాడు. అలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి రూ.9 లక్షలపాటు గేమ్‌ను ఆడాడు. అంతటితో ఆగకుండా.. ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాలోంచి ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.1.60 లక్షలు, రూ.1.45 లక్షలు, ఇలా విడతలవారీగా రూ.27 లక్షలతో ఫ్రీ ఫైర్‌ గేమ్ ఆడాడు. అయితే.. బాలుడి తల్లి తనకు డబ్బులు అవసరమై బ్యాంక్‌కు వెళ్లగా.. అకౌంట్ ఖాళీ అంటూ అధికారులు చెప్పడంతో ఆమె షాకైంది.

వెంటనే లబోదిబోమంటూ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాలోంచి రూ.9 లక్షలు, ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.27 లక్షలు పోయినట్లుగా గుర్తించారు. ఈ డబ్బు తన భర్త కష్టార్జితమని ఆయన సైబరాబాద్‌ పోలీసుశాఖలో ఉన్నతాధికారిగా పని చేసేవారని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆయన మృతి అనంతరం వచ్చిన డబ్బు ఇదేనంటూ బాలుడి తల్లి పోలీసులతో చెప్పి వాపోయింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాంటూ పోలీసులను కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..