Nallagonda: కిడ్నాప్‌కు గురైన వ్యక్తి దారుణ హత్య.. మృతదేహన్ని పూడ్చిపెట్టిన నిందితుడు, ఎవరో తెలిసి అంతా షాక్‌!

నల్గొండ జిల్లాలో కిడ్నాప్‌ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఐదు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని కనికరం లేకుండా హతమార్చిన కిడ్నాపర్లు..మృతదేహాన్ని కూడా

Nallagonda: కిడ్నాప్‌కు గురైన వ్యక్తి దారుణ హత్య.. మృతదేహన్ని పూడ్చిపెట్టిన నిందితుడు, ఎవరో తెలిసి అంతా షాక్‌!
మృతుడు రాజశేఖర్, నిందితుడు
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 04, 2022 | 12:32 PM

నల్గొండ జిల్లాలో కిడ్నాప్‌ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఐదు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని కనికరం లేకుండా హతమార్చిన కిడ్నాపర్లు..మృతదేహాన్ని కూడా పూడ్చిపెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొడుకు మరణవార్త తెలిసి అతడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం రాజశేఖర్(27) అనే యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. రాజశేఖర్‌ ఆచూకీ కోసం కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వైపు పోలీసులు గాలింపు చేస్తుండగానే, మరోవైపు రామచంద్రగూడెం శివారులో రాజశేఖర్ హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితుడే హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే నిందితులు రాజశేఖర్‌ను హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హత్య అనంతరం రాజశేఖర్ మృతదేహాన్ని నిందితుడే పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్‌ మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. తోటి స్నేహితుడే హత్యకుడు పాల్పడ్డాడని తెలిసి గ్రామస్తులు సైతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. వారిని ఓదార్చటం ఎవరి వల్లకాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం..