AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బిర్యానీ రుచిగా లేదని రెచ్చిపోయిన కస్టమర్లు..! రెస్టారెంట్‌లో లొల్లి..

ఓ రెస్టారెంట్‌కు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. బిర్యానీ కావాలని ఆర్డర్‌ పెట్టారు. అయితే, వెయిటర్‌ బిర్యానీ తీసుకొచ్చారు. కానీ, ఆ వచ్చిన వ్యక్తులకు బిర్యానీ నచ్చలేదట. దాంతో..

Telangana: బిర్యానీ రుచిగా లేదని రెచ్చిపోయిన కస్టమర్లు..! రెస్టారెంట్‌లో లొల్లి..
Jyothi Gadda
|

Updated on: Jun 04, 2022 | 9:23 AM

Share

కామారెడ్డి జిల్లాలో యువకులు రెచ్చిపోయారు. బిర్యానీ రుచిగా లేదంటూ హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఓ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ రుచిగా కాలేదంటూ కోపంతో ఊగిపోయారు ఐదుగురు వ్యక్తులు. నోటికి వచ్చిన బూతు మాటలు తిడుతూ హల్‌చల్‌ చేశారు. రెస్టారెంట్ యజమాని సంతోష్ , కుకర్, వెటర్ వర్కర్ల పై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు వర్కర్లకు తీవ్ర గాయాలయ్యాయి. రెస్టారెంట్ లోని ఫర్నీచర్‌ మొత్తం ధ్వంసం చేశారు.

జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలోని ఓ రెస్టారెంట్‌కు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. బిర్యానీ కావాలని ఆర్డర్‌ పెట్టారు. అయితే, వెయిటర్‌ బిర్యానీ తీసుకొచ్చారు. కానీ, ఆ వచ్చిన వ్యక్తులకు బిర్యానీ నచ్చలేదట. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ ఐదుగురు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా హోటల్‌ సిబ్బందిపై దాడికి దిగారు. యువకుల దాడిలో హోటల్‌ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో రెస్టారెంట్ లోని ఫర్నిచర్‌ని సైతం ధ్వంసం చేశారు ఆ ఐదుగురు వ్యక్తులు. దాడికి పాల్పడ్డ వారు బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు. వెంటనే బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రెస్టారెంట్ యజమాని సంతోష్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు