AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects of Cucumber: కీరదోస ఆ సమయంలో తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా తెలుసుకోండి..

Side Effects of Cucumber: వేసవి కాలంలో ఎండ వేడిమికి జనాలు అతలాకుతలం అవుతుంటారు. చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో శరీర ఉష్ణోగ్రతను

Side Effects of Cucumber: కీరదోస ఆ సమయంలో తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా తెలుసుకోండి..
Keera
Shiva Prajapati
|

Updated on: Jun 04, 2022 | 1:37 PM

Share

Side Effects of Cucumber: వేసవి కాలంలో ఎండ వేడిమికి జనాలు అతలాకుతలం అవుతుంటారు. చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కొన్నిరకాల ఆహారాలను తింటారు. అయితే, ముఖ్యంగా చల్లదనం కోసం పుచ్చకాయ, కీర దోసకాయలను తింటుంటారు. కీరదోసకాయంలో విటమిన్ B, విటమిన్ C, విటమిన్ K, పొటాషియం, కాపర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరం హైడ్రేట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కీరదోసకాయ తీసుకోవడం వలన కొన్ని దుష్ఫ్రభావాలు కూడా ఉన్నాయి. ఆ దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట దోసకాయ తినకూడదు.. వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనం కోసం కీరదోసకాయలను తింటే మించిదే. కానీ, అతిగా తినడం వల్ల, సమయం తప్పి తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. రాత్రిపూట దోసకాయ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు దోసకాయ తినడం వల్ల మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది.

దోసకాయ తినడం వల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలు: 1. దోసకాయ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. మలబద్ధకానికి కారణం అవుతుంది. అలాగే గ్యాస్ సమస్యకు కూడా కారణం అవుతుంది. ‘ఈట్ దిస్ నాట్ దట్‌’ నివేదిక ప్రకారం. “దోసకాయలలో కుకుర్బిటాసిన్ ఉంటుంది. ఇది గుమ్మడికాయ, స్క్వాష్, పుచ్చకాయతో సహా ఇతర పండ్లు, కూరగాయలలో కనిపించే సమ్మేళనం. కుకుర్బిటాసిన్ దోసకాయలలో చేదు రుచిని కలిగిస్తుంది. ఇది గ్యాస్‌, అజీర్తికి కారణం అవుతుంది. ఒకేసారి ఎక్కువ దోసకాయలు తింటే ఈ అసౌకర్య లక్షణాలు కనిపిస్తాయి”.

ఇవి కూడా చదవండి

2. దోసకాయలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది అతిగా తినడం వలన మీ ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్‌కు హాని కలిగించవచ్చు.

3. సైనస్ ఇన్‌ఫెక్షన్‌కు కారణం అవుతుంది. మీరు ఏవైనా వ్యాధులతో బాధపడుతున్నట్లయితే.. శాకాహారాన్ని జాగ్రత్తగా తినాలి.

4. అమెరికన్ అకాడమీ ఆఫ్ అలర్జీ ఆస్తమా, ఇమ్యునాలజీ అధ్యయనం ప్రకారం.. రాగ్‌వీడ్ పుప్పొడి, పుచ్చకాయలు, చమోమిలే టీ, అరటిపండ్లు, పొద్దుతిరుగుడు గింజలు అలెర్టీకి కారణం అవుతాయి. అలాగే కీర దోసకాయ తిన్న వ్యక్తులకు కూడా చర్మ సంబంధిత అలెర్జీ వచ్చే అవకాశం ఉంది.