AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. అవే గుండెపోటుకు కారణం!

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. రక్తనాళాల్లో

Heart Attack: ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. అవే గుండెపోటుకు కారణం!
Heart Attack
Jyothi Gadda
|

Updated on: Jul 30, 2022 | 7:47 PM

Share

Heart Attack: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి మిడిల్‌ ఏజ్‌ వరకు అందరిపై ఎటాక్‌ చేస్తుంది గుండెపోటు. కరోనా తర్వాత ఇలాంటి గుండెపోటు సమస్యలు అధికమయ్యాయంటూ పలు నివేదికలు కూడా చెబుతున్నాయి. ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో గుండెపోటు బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని గమనిస్తే.. గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా గుండెకు రక్త ప్రసరణ సరిగా కాకపోతే.. హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే,ఈ హార్ట్‌ఎటాక్‌ అంటే సడెన్ గా వస్తుంది అనుకుంటారు. కానీ, అది నిజంకాదట. సరిగ్గా గమనిస్తే.. గుండె పోటు వచ్చే ముందు మన శరీరం కొన్ని సిగ్నల్స్‌ ఇస్తుందట. కానీ ఎవరూ వాటిని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోరు. అర్థం అవుతున్నా.. వాటిని లైట్‌గా తీసుకుంటారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందే ఎడమవైపు శరీరభాగాల్లో నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు, ఎడమ చేయి నుంచి పైన దవడ వరకూ నొప్పి వస్తుండటం వంటివి కనిపిస్తాయి. చెమటలు విపరీతంగా వస్తుంటాయి. ఎన్ని నీళ్లు తాగినా నోరు పొడిబారినట్లే ఉంటుంది. స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఛాతీ కూడా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వేధిస్తూ.. ఎంతకీ తగ్గకపోవటం కూడా అనుమానించాలంటున్నారు. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలుగా చెబుతున్నారు. గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు. మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురికావడం, చెప్పాలనుకొనే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. రక్తనాళాల్లో అడ్డంకులు లేకుండా చేస్తుంది. ఓట్స్, చేపలు, వెల్లుల్లి, పెసలు వంటి ప్రతి రోజూ తీసుకుంటూ ఉండాలి. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తి ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి