AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pani Puri Side Effects: మీరు వీటిని తింటున్నారా..? అయితే ఇది మీ కోసమే..

చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేవాటిల్లో పానీ పూరీ, గోల్గప్ప తప్పక ఉంటాయి. రోడ్ల పక్కన కనిపించే ప్రతిదీ తినకూడదు.. తింటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయని మనందరికీ

Pani Puri Side Effects: మీరు వీటిని తింటున్నారా..? అయితే ఇది మీ కోసమే..
Pani Puri
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 24, 2022 | 2:11 PM

Share

చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేవాటిల్లో పానీ పూరీ, గోల్గప్ప తప్పక ఉంటాయి. రోడ్ల పక్కన కనిపించే ప్రతిదీ తినకూడదు.. తింటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలుసు. కానీ ఎందుకో అందరం వెళ్లి వాటినే తినడానికి ఇష్టపడతాం. కానీ  పానీ పూరీ, గోల్గప్పలను ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం సీజన్‌లో వీటిని తింటే టైఫాయిడ్, ఇంకా అనేక ఇతర సమస్యలకు దారితీస్తుందిన వైద్య నిపుణులు అంటున్నారు.

ఆరోగ్యంపై ప్రభావాలు: 

వర్షాకాలంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యాధులలో టైఫాయిడ్ చాలా ముఖ్యమైనదనే చెప్పుకోవాలి. తెలంగాణలో టైఫాయిడ్ రోగుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీని దీనికి బాధ్యతగా పరిగణించింది. 

ఇవి కూడా చదవండి

మే నెలలో తెలంగాణలో సుమారు 27,00 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, జూన్ నెలలో 2752 కేసులు నమోదయ్యాయి. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ టైఫాయిడ్‌కు ‘‘పానీ పూరీ డిసీజ్’’ అని పేరు పెట్టారు. పానీ పూరీ వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని  అనేక మంది వైద్యులు పేర్కొన్నారు.

గోల్గప్పస్, పానీ పూరీ సైడ్ ఎఫెక్ట్స్

గోల్గప్ప వల్ల టైఫాయిడ్ మాత్రమే కాదు, శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే చాలా మంది పిల్లలలో గొల్గప్ప తినడం నిషేధం. దీని కారణంగా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం-

  • గొల్గప్పను అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది.
  • మీ పిల్లలు ఎక్కువ గొల్గప్పలను తీసుకుంటే అది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. 
  • గొల్లకాయలు ఎక్కువగా తింటే వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశం ఉంది. 
  • పానీ పూరీ వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 
  • పానీ పూరీని ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. 
  • గొల్గప్ప ప్రేగులలో మంటకు కూడా కారణం కావచ్చు. 

గొల్గప్ప తినడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా వీధిలో బయట దొరికే గొల్గప్పల వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వర్షాకాలంలో గొల్గప్ప తినకూడదని సూచిస్తున్నారు. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా జిగురు లేకుండా ఇలా చేయండి 
బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా జిగురు లేకుండా ఇలా చేయండి 
పీజీలు, అద్దె‌గదుల్లో ఉంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? హ్యాపీనెస్ దారి
పీజీలు, అద్దె‌గదుల్లో ఉంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? హ్యాపీనెస్ దారి
డబ్బుల ఆశ చూపించి యువకుడిని బలిచ్చారా? మహారాష్ట్రలో కలకలం!
డబ్బుల ఆశ చూపించి యువకుడిని బలిచ్చారా? మహారాష్ట్రలో కలకలం!
ఏ టిఫిన్ కి అయినా ఒక్కటే కారంపొడి.. హోటల్ స్టైల్ ల్లో చేసేయండి ఇల
ఏ టిఫిన్ కి అయినా ఒక్కటే కారంపొడి.. హోటల్ స్టైల్ ల్లో చేసేయండి ఇల
మనిషిలోని ఈ 3 భావోద్వేగాలే ప్రశాంతతకు అడ్డంకులు.. శ్రీకృష్ణుడు..
మనిషిలోని ఈ 3 భావోద్వేగాలే ప్రశాంతతకు అడ్డంకులు.. శ్రీకృష్ణుడు..
గోల్డ్, వెండి కాదు.. ఒకేసారి కుప్పకూలిన ఎర్ర బంగారం..
గోల్డ్, వెండి కాదు.. ఒకేసారి కుప్పకూలిన ఎర్ర బంగారం..
కారంగా అదిరిపోయే రుచితో నెల రోజులు నిల్వ ఉండే ఉల్లిపాయ పచ్చి కారం
కారంగా అదిరిపోయే రుచితో నెల రోజులు నిల్వ ఉండే ఉల్లిపాయ పచ్చి కారం
వంటింట్లోని ఈ రెండు కలిపి వేస్తే.. కనకాంబరం పూలు విరగబూస్తాయి
వంటింట్లోని ఈ రెండు కలిపి వేస్తే.. కనకాంబరం పూలు విరగబూస్తాయి
ఓటీపీ రాకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ..
ఓటీపీ రాకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ..
ఈ సినిమాల్లో హీరోల కన్నా విలన్లే తోపు.. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్
ఈ సినిమాల్లో హీరోల కన్నా విలన్లే తోపు.. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్