Healthy Tips: డిన్నర్ టైమింగ్ విషయంలో ఆ ఒక్క తప్పు చేయకండి.. లేదంటే ఈ సమస్యలు రావొచ్చు..

చెప్పాలంటే.. మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ అర్థరాత్రి భోజనం మాత్రం చేస్తారు. దీంతో మీరు చేసే ఆరోగ్య వ్రతం మొత్తం చెడిపోతుంది. అర్థరాత్రి తినడం మీ ఆరోగ్యాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలిస్తే షాకవుతారు.

Healthy Tips: డిన్నర్ టైమింగ్ విషయంలో ఆ ఒక్క తప్పు చేయకండి.. లేదంటే ఈ సమస్యలు రావొచ్చు..
Eating Food
Follow us

|

Updated on: Nov 24, 2022 | 5:56 PM

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆలస్యంగా తినడం ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. కానీ ఈ అర్థరాత్రి తినడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుందనే విషయాన్ని మరిచిపోయారు. కొన్ని కారణాల వల్ల మీరు కొన్నిసార్లు ఆలస్యంగా తింటే దానితో సమస్య లేదు. కానీ మీలో ఎవరైనా దీన్ని అలవాటుగా మార్చుకుంటే మాత్రం పెద్ద ప్రమాదంలో పడినట్లే అని చెప్పవచ్చు. అది మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి 8:00 గంటల తర్వాత భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే నిద్ర, ఆహారం మధ్య 2 గంటల గ్యాప్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యంగా తినడం లేదా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, శరీరంలోని జీవక్రియలు నెమ్మదిగా పని చేయడం మానేస్తాయి.. దీంతో రాబోయే రోజుల్లో మీకు అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతాయి. అవి ఎలాంటి సమస్యలు వస్తాయో ఓ సారి తెలుసుకుందాం..

ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

బరువు పెరగడం:

నేటి కాలంలో యువత ఒబేసిటీతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. జిమ్ ఎక్సర్సైజులు చేసినా ఊబకాయం మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం రాత్రిపూట ఆలస్యంగా తినడం తప్ప మరొకటి కాదు. మీ బరువును అదుపులో ఉంచుకుంటే..  ఖచ్చితంగా ఆహారం, నిద్ర మధ్య 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉంచండి.

నిద్ర..

తరచుగా నిద్రలేమి గురించి వైద్యులను సంప్రదిస్తున్న వారి సంఖ్య ఈ మధ్యాకలంలో చాలా పెరిగిపోయింది. మీరు ఆహారం ఆలస్యంగా తినడం వల్ల ఇది జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. అయినా వారి రోజు వారి దినచర్య మాత్రం మారదు. ఇలా ఆలస్యంగా తినడం వల్ల మీ శరీర సహజ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు ఇబ్బందిగా ఫీలవుతారు. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతారు.

బీపీ వచ్చే అవకాశాలు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిరంతరం ఆలస్యంగా తినడం వల్ల మీకు బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహ సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా ఆలస్యంగా భోజనం చేయడం ద్వారా మీ బరువు పెరుగుతుంది. రక్తంలో చక్కెర అదుపు లేకుండా ఉంటుంది. దీని వల్ల బీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

జీర్ణక్రియ..

రాత్రి భోజనం చేసిన తర్వాత, మీరు నేరుగా పడుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీకు ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తాయి. ఎందుకంటే మీరు ఆహారం తిన్న తర్వాత ఎటువంటి కార్యకలాపాలు చేయరు. దీని కారణంగా, ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.

తక్కువ శక్తి స్థాయి

మీరు రాత్రిపూట ఆలస్యంగా తింటే, రెండవ రోజు మీకు మలబద్ధకం, తలనొప్పి, ఇతర సమస్యలు మొదలవుతాయి. ఇది మీ శక్తి స్థాయిని తగ్గిస్తుంది. చాలా సార్లు రాత్రి ఆలస్యంగా తినడం వల్ల మీకు నిద్ర రాదు. దీని కారణంగా మీరు కూడా తలనొప్పి సమస్య మొదలవుతుంది. దీంతో మీ రోజంతా వృధా అవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Latest Articles
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది